పారిశుధ్య నిర్వహణ, యూజర్ ఛార్జ్ ల వసూలు అంశాలపై విజయవాడ మేయర్ సమీక్ష

  • అధికారులకు పలు సూచనలు చేసిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మంగళవారం ఆమె ఛాంబర్ నందు ప్రజారోగ్య మరియు రెవిన్యూ అధికారులతో సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధానంగా నగరంలో పారిశుధ్య నిర్వహణ విధానమును కూడా మరింత మెరుగుపరచుటకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షాలు కురుస్తున్న సమయాలలో డ్రెయిన్ నందు మురుగునీరు సక్రమముగా ప్రవహించేలా డ్రెయిన్ నందు చెత్త మరియు వ్యర్ధములను ఎప్పటికప్పుడు తొలగించునట్లుగా చూడాలని అన్నారు. పారిశుధ్య నిర్వహణ నగరంలో పందులు మరియు కుక్కలకు సంబందించి ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించుకోవాలని అన్నారు.

అదే విధంగా పారిశుధ్య నిర్వహణకు సంబందించి ప్రజల నుండి వసూలు చేస్తున్న యూజర్ ఛార్జ్ లు మరియు రెవిన్యూ వసూలు యొక్క విధానమును అడిగి తెలుసుకోని పలు సూచనలు చేశారు. ప్రతి డివిజన్ నందు విధిగా శానిటరీ సెక్రటరీల ద్వారా మాత్రేమే యూజర్ ఛార్జ్ లను వసూలు చేయునట్లుగా చూడాలని అన్నారు. డివిజన్ కార్పొరేటర్ల సహకారంతో శానిటరీ సెక్రెటరీలు వార్డ్ వాలెంటరీలు మరియు సిబ్బంది సర్వే నిర్వహించాలని అన్నారు.

సమావేశంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, డిప్యూటీ కమిషనర్(రెవిన్యూ) వెంకటలక్ష్మి, వి.ఏ.ఎస్ డా.రవి చాంద్ , అసిస్టెంట్ కమిషనర్లు, హెల్త్ ఆఫీసుర్లు పాల్గొన్నారు.

More Press News