పార్క్ లలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: వీఎంసీ కమిషనర్

  • సత్వరమే సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలి 
విజ‌య‌వాడ‌: బందర్ రోడ్డు రాఘవయ్య పార్క్ నందు జరుగుతున్న ఆధునికీకరణ పనులను నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ శనివారం అధికారులతో కలసి పర్యవేక్షించారు. పార్క్ నందలి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. పార్క్ లో అభివృద్ది పరచిన గ్రీనరీ, లాన్, పాత్ వే మరియు పిల్లల ఆట పరికరాలు ఏర్పాటు మొదలగునవి పరిశీలిస్తూ, పార్క్ నందు సందర్శకులను ఆకర్షించే విధంగా అందమైన పూల మొక్కలు ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఇంకను పార్క్ నందు చేపట్ట వలసిన ఇంజనీరింగ్ మరియు గ్రీనరీ పనులను కూడా సత్వరమే చేపట్టి పూర్తి చేయాలని అన్నారు.

పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఎ.డి.హెచ్. జె. జ్యోతి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.దేవినగర్, దావు బుచ్చయ్య కాలనీ నందలి వార్డ్ సచివాలయాల సందర్శన:
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, వివిధ సంక్షేమ పథకములకు సంబంధించి లబ్దిదారుల జాబితా, సంక్షేమ క్యాలెండర్ మొదలగునవి నోటీసు బోర్డు నందు ఉంచాలని ఆదేశించారు. న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ శనివారం 30వ డివిజన్ పరిధిలోని దేవినగర్, దావు బుచ్చయ్య కాలనీ ప్రాంతాలలో గల 247, 249, 250 మరియు 251 వార్డ్ సచివాలయములను సందర్శించారు.

సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌ను పరిశీలిస్తూ, సిబ్బంది ప్రతి ఒక్కరు సమయపాలన పాటించి తప్పని సరిగా బయో మెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయవలెనని ఆదేశించారు. సచివాలయంలో రిజిస్టర్ ల నిర్వహణ సక్రమముగా ఉండాలని ఆదేశించారు. సచివాలయాలలో ప్రజల నుండి సమస్యలపై అందిన దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకొని ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

More Press News