చెత్త సేకరణ వాహనాలు ప్రారంభించిన విజయవాడ మేయర్
- నగరంలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచుటయే లక్ష్యంగా చెత్త సేకరణ కొరకు 60 చెత్త సేకరణ వాహనాలు ప్రారంభించిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
ఈ సందర్భంలో మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ (CLAP) కార్యక్రమములో భాగంగా చెత్త సేకరణకై స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ద్వారా మన నగరానికి 225 వాహనాలు కేటాయించుట జరిగిందని అన్నారు. నగర పరిధిలో గల 4 శానిటరీ సర్కిల్స్ కు 15 చొప్పున వాహనాలు అందించారు. వాహనములపై విధులు నిర్వహించు సిబ్బంది వీటిని తమ యొక్క సొంత వాహనముగా భావించి జాగ్రత్తగా వినియోగించాలని అన్నారు. అధికారులు కూడా ప్రతి నిత్యం క్షేత్ర స్థాయిలో సదరు వాహనాలను పరిశీలిస్తూ, చెత్త సేకరణతో పాటుగా వాహనాలకు అమర్చిన మైక్ ద్వారా పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించునట్లుగా చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమములో కార్పొరేటర్లు మొహమ్మద్ షహీనా సుల్తానా, కొండాయగుంట మల్లీశ్వరి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి మరియు హెల్త్ ఆఫీసర్లు డా.సురేష్, డా.ఇక్బాల్ హుస్సేన్, డా.రామకోటేశ్వరరావు, డా.శ్రీదేవి మరియు శానిటరీ సూపర్ వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, సచివాలయ శానిటరీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.