మానసిక ఉల్లాసానికి యోగా దోహదం: వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ: మొగల్రాజపురం బోయపాటి శివరామ క్రిష్నయ్య మున్సిపల్ కార్పోరేషన్ హైస్కూల్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబిలీ హరిత ఆధ్వర్యంలో “యోగా శిక్షణ“ తరగతుల ప్రారంభ కార్యక్రమములో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ వారి “యోగా టీమ్“ నిర్వహించిన యోగాసనాలను తిలకించారు.
ముందుగా దేశంలోనే 3వ క్లీనెస్ట్ సిటీ అవార్డు అందుకున్న కమిషనర్ ని పాఠశాల ఉపాధ్యాయని ఉపాధ్యాయులు మరియు లయన్స్ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంలో కమిషనర్ మాట్లాడుతూ సమస్యలు వచ్చినప్పడు ఆగకుండా ముందుకు వెళ్ళువారు విజయం సాధిస్తారని, ప్రతి రోజు యోగా చేస్తే రిలాక్స్ గా ఉంటుందని, డాక్టర్ దగ్గరకు వెళ్లే పని ఉండదని ఏకాగ్రత పెరుగుతుందని, “మానసిక ఉల్లాసానికి ఆరోగ్యానికి యోగాభ్యాసం ఉత్తమ సాధన అన్నారు.
అదే విధంగా లయన్స్ డిస్త్రిక్ గవర్నర్, 316డీ దేవినేని జొనీ కుమారి, పీఎంజేఎఫ్ యోగా శిక్షణ ప్రోసిడింగ్ ఆఫీసర్ లయన్ అంకాల సత్యనారాయణ విద్యార్ధులతో యోగాసనాలు చేయించి యోగా ప్రాముఖ్యత తెలియజేశారు. లయన్ మిరియాల వెంకటేశ్వరరావు, పీఎంజేఎఫ్ మరియు AMMA ప్రెసిడెంట్ ఈ పాఠశాలను దత్తత తీసుకోని అనేక సేవా కార్యక్రమములు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమములో స్థానిక కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, ఇతర లయన్స్ ప్రముఖులు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ కేవీవీఆర్ రాజు, పాఠశాల సూపర్ వైజర్లు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు మరియు విద్యార్ధులు తల్లిదండ్రలు పాల్గొన్నారు.
టిడ్కో నివాసాలకు సంబందించి జరుగుతున్న డాక్యుమెంటేషన్ విధానము పరిశీలన:
టిడ్కో నివాసాలకు సంబందించి లబ్దిదారులకు లోన్ డాక్యుమెంటేషన్ పూర్తి చేసి 17మందికి నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు లబ్దిదారులకు లోన్ మంజూరు పత్రాల అందజేశారు.
తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నగరపాలక సంస్థ మరియు బ్యాంకు ఆఫ్ బరోడా సంయుక్తoగా నిర్వహించిన మెగా లోన్ మేళ నందు నగరంలోని 768 మందికి బ్యాంకు లోన్ కొరకు డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తి చేసి అర్హులైన వారికీ లోన్ మంజూరు చేయుట జరిగినది. ఈ సందర్భంలో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ పేదలకు ఇల్లు పథకం ద్వారా అర్హులైన వారికీ ఉచితంగా స్థలములను అందించుట జరిగిందని అన్నారు.
అదే విధంగా ఎక్కువ చ.మీ గల నివాసాలకు సంబందించి ప్రభుత్వం సబ్సిడీ పోను మిగిలిన 5400 గృహాల లబ్దిదారులకు సులభమైన పద్దతిలో ప్రతి నెల బ్యాంక్ వారికీ జమ చేసేలా ప్రభుత్వం బ్యాంక్ నుండి బుణ సౌకర్యం కల్పించుట జరుగుతుందని పేర్కొన్నారు. దీనికొరకు సింగల్ విండో సిస్టం పద్దతిలో లబ్దిదారులకు ఒకే రోజున లోన్ మంజురుకు చర్యలు తీసుకోవటం జరుగుతుందని దానిలో భాగంగా నేటి లోన్ మేళ నందు 14 బ్రాంచ్ ల ద్వారా రూ.26.10 కోట్ల ఋణాల మంజురుకు కావలసిన ప్రక్రియను నిర్వహించినట్లు తెలిపారు. గతంలో యునియన్ బ్యాంక్ ద్వారా కొంత మందికి బుణాలు మంజూరు చేయుట జరిగిందని, త్వరలో కెనర బ్యాంక్ నుండి కూడా ఇదే విధంగా బుణ మేళ చేపట్టుట జరుగుతుందని అన్నారు.
అదే విధంగా రాజశేఖర్, డీజీఎం బ్యాంక్ అఫ్ బరోడా మాట్లాడుతూ 384 మందికి 365 చ.మీ వారికీ రూ.3,15,000/- మరియు 384 మందికి 430 చ.మీ వారికీ రూ.3,65,000/- బుణముల కొరకు బ్యాంక్ బ్రాంచిల వద్దకు వెళ్ళకుండా ఒక రోజులో బ్యాంకర్లు మరియు నగరపాలక సంస్థ సిబ్బంది అన్ని రకముల దరఖాస్తులు పూర్తి చేసినట్లు మిగిలిన వారికీ కూడా సత్వరమే పూర్తి చేస్తామని అన్నారు.
కార్యక్రమములో ప్రాజెక్ట్ ఆఫీసర్ డా.జె అరుణ, రాజశేఖర్, డీజీఎం బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటుగా 14 బ్యాంక్ మేనేజర్లు, 32 మంది రిసోర్స్ పర్సన్స్, సి.ఓ మరియు సి.డి.ఓ నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సచివాలయ సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలి: కమిషనర్
7వ డివిజన్ పరిధిలోని 37వ వార్డ్ సచివాలయమును కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆకస్మికంగా తనిఖీ చేసి సచివాలయ సిబ్బంది విధుల హాజరుపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరు అంకిత భావంతో విధి నిర్వహణ చేయవలెనని, వార్డ్ వాలంటీర్ల ద్వారా, సచివాలయ సిబ్బంది ద్వారా పౌర సేవలు ప్రజలకు సత్వరమే అందునట్లు చూడవలెనని పేర్కొన్నారు. సోమవారం జరుగనున్న మెగా వాక్సినేషన్ డే పై ప్రజలందరికీ అవగాహన కల్పించి తప్పక వాక్సినేషన్ వేయించుకోనునట్లుగా చూడాలని అన్నారు. సచివాలయ ప్రత్యేక అధికారులు సిబ్బందితో సమావేశములు ఏర్పాటు చేసి ప్రత్యేక మెగా వాక్సినేషన్ డ్రైవ్ పై ప్రజలను చైతన్యవంతులను చేయవలసినదిగా ఆదేశించారు.