భవానీ దీక్షల విరమణకు నగరపాలక సంస్థ ద్వారా విస్తృత ఏర్పాట్లు: వీఎంసీ కమిషనర్
విజయవాడ: భవానీ దీక్షల విరమణకు వివిధ ప్రాంతాల నుండి వచ్చు భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాల కల్పనకై కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశములతో నగరపాలక సంస్థ తరుపున విస్తృత ఏర్పాట్లు చేయడమైనది. భక్తులకు అందుబాటులో ఉండేలా వివిధ ప్రదేశాలలో 190 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసి 24 గంటలు పరిశుభ్రంగా ఉండునట్లుగా సిబ్బందిని నియమించి టాయిలెట్స్ ఎప్పటికపుడు శుభ్రపరచి సెంటేడ్ ఫీనయిల్ చల్లి పరిశుభ్రంగా ఉండునట్లుగా మరియు మరుగుదొడ్ల వద్ద నిరంతరం నీటి సరఫరా కల్పించి భక్తులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవటం జరిగింది.
దేవస్థానం పరిసర ప్రాంతాలతో పాటుగా భవానీలు గిరి ప్రదక్షణ చేయు మార్గములలో ప్రత్యేక కౌంటర్ లను ఏర్పాటు చేసి త్రాగునీటి ట్యాంక్ అందుబాటులో ఉంచుటతో పాటు మంచి నీటి ప్యాకెట్ల పంపిణి కొరకు సిబ్బందిని ఇంజనీరింగ్ విభాగం ద్వారా నియమించుట జరిగింది. యాత్రికుల సౌకర్యార్దం ఎస్టేట్ విభాగం ద్వారా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద, రాజీవ్ గాంధీ పార్క్, రథం సెంటర్, హెడ్ వాటర్ వర్క్ వద్ద సామాన్లు మరియు పాద రక్షలు భద్రపరచుట కొరకు 24 గంటలు పని చేసేలా 4 ప్రదేశాలలో క్లోక్ రూమ్ లను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల గిరి ప్రదక్షణకి అనువుగా రోడ్లపై ఏర్పడిన గుంతలకు ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేయుట జరిగింది.
ప్రజారోగ్య విభాగం ద్వారా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమములు చేపట్టుట జరిగినది. 24 గంటలు అన్ని ప్రాంతములలో ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, తగు క్రిమి సంహారకములు జల్లుతూ, పాగ్గింగ్ వంటి చర్యలు తీసుకోవటం జరిగింది. క్యూ లైన్ల యందు 30 ప్రత్యేక ప్రదేశములలో కోవిడ్ -19 దృష్టిలో ఉంచుకొని భక్తులకు ధర్మల్ స్కానింగ్, శానిటైజేషన్ నిర్వహిస్తూ, మాస్క్ లు అందచేయు కార్యక్రమములు చేపట్టబడినవి. కోవిడ్-19 దృష్ట్యా భక్తులు తీసుకొనవలసిన జాగ్రత్తలపై వార్డ్ శానిటేషన్ సెక్రటరీల ద్వారా మైక్ ద్వారా భక్తులకు అవగాహన కార్యక్రమములు చేపట్టుట జరిగింది. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం నందు 3 షిఫ్ట్ లలో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 8181960909 ఏర్పాటు చేసి వారికీ అందిన ఫిర్యాదులకు సత్వరమే ఆయా విభాగముల వారికీ పంపి వాటిని యుద్దప్రాతిపదికన పరిష్కరించునట్లుగా తగిన ఏర్పాట్లు చేయడమైనది.
భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు విషయమై ఎప్పటికప్పడు అప్రమత్తంగా ఉంటు, ఎక్కడా చిన్న లోపములు కూడా తలెత్తకుండా పని చేయాలనీ పర్యవేక్షణ లోపం లేకుండా చూడాలని కమిషనర్ ఇచ్చిన ఆదేశములతో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి, చీఫ్ మెడికల్ అధికారి డా. జి.గీతాభాయి, ఎస్టేట్ అధికారి టి.శ్రీనివాస్ క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ, అధికారులు మరియు సిబ్బందిని అప్రమత్తం చేయుచున్నారు.
పారిశుధ్య నిర్వహణ విధానమును పరిశీలించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్: నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ శనివారం బృందావన్ కాలనీ నందలి పలు వీదులలో జరుగుతున్న పారిశుధ్య నిర్వహణ విధానమును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్బంలో ఆయా వీదులలో చేపట్టివలసిన రోడ్ ప్యాచ్ వర్క్ పనుల విషయమై అధికారులతో చర్చించి, వెనువెంటనే పనులు చేపట్టి పూర్తి చేయాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్ర శేఖర్ ను ఆదేశించారు. అదే విధంగా ఆయా ప్రదేశాలలో డ్రెయిన్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్ర శేఖర్ తో పాటుగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాత్రుడు మరియు శానిటరీ ఇన్స్ పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
దేవస్థానం పరిసర ప్రాంతాలతో పాటుగా భవానీలు గిరి ప్రదక్షణ చేయు మార్గములలో ప్రత్యేక కౌంటర్ లను ఏర్పాటు చేసి త్రాగునీటి ట్యాంక్ అందుబాటులో ఉంచుటతో పాటు మంచి నీటి ప్యాకెట్ల పంపిణి కొరకు సిబ్బందిని ఇంజనీరింగ్ విభాగం ద్వారా నియమించుట జరిగింది. యాత్రికుల సౌకర్యార్దం ఎస్టేట్ విభాగం ద్వారా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద, రాజీవ్ గాంధీ పార్క్, రథం సెంటర్, హెడ్ వాటర్ వర్క్ వద్ద సామాన్లు మరియు పాద రక్షలు భద్రపరచుట కొరకు 24 గంటలు పని చేసేలా 4 ప్రదేశాలలో క్లోక్ రూమ్ లను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల గిరి ప్రదక్షణకి అనువుగా రోడ్లపై ఏర్పడిన గుంతలకు ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేయుట జరిగింది.
ప్రజారోగ్య విభాగం ద్వారా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమములు చేపట్టుట జరిగినది. 24 గంటలు అన్ని ప్రాంతములలో ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, తగు క్రిమి సంహారకములు జల్లుతూ, పాగ్గింగ్ వంటి చర్యలు తీసుకోవటం జరిగింది. క్యూ లైన్ల యందు 30 ప్రత్యేక ప్రదేశములలో కోవిడ్ -19 దృష్టిలో ఉంచుకొని భక్తులకు ధర్మల్ స్కానింగ్, శానిటైజేషన్ నిర్వహిస్తూ, మాస్క్ లు అందచేయు కార్యక్రమములు చేపట్టబడినవి. కోవిడ్-19 దృష్ట్యా భక్తులు తీసుకొనవలసిన జాగ్రత్తలపై వార్డ్ శానిటేషన్ సెక్రటరీల ద్వారా మైక్ ద్వారా భక్తులకు అవగాహన కార్యక్రమములు చేపట్టుట జరిగింది. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం నందు 3 షిఫ్ట్ లలో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 8181960909 ఏర్పాటు చేసి వారికీ అందిన ఫిర్యాదులకు సత్వరమే ఆయా విభాగముల వారికీ పంపి వాటిని యుద్దప్రాతిపదికన పరిష్కరించునట్లుగా తగిన ఏర్పాట్లు చేయడమైనది.
భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు విషయమై ఎప్పటికప్పడు అప్రమత్తంగా ఉంటు, ఎక్కడా చిన్న లోపములు కూడా తలెత్తకుండా పని చేయాలనీ పర్యవేక్షణ లోపం లేకుండా చూడాలని కమిషనర్ ఇచ్చిన ఆదేశములతో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి, చీఫ్ మెడికల్ అధికారి డా. జి.గీతాభాయి, ఎస్టేట్ అధికారి టి.శ్రీనివాస్ క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ, అధికారులు మరియు సిబ్బందిని అప్రమత్తం చేయుచున్నారు.
పారిశుధ్య నిర్వహణ విధానమును పరిశీలించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్: