రాజకీయాలకు ఇది సరైన వేదిక కాదు, మహిళా కమిషన్ అడ్డుకోవడం సరికాదు

బాధితులను బెదరగొట్టేలా మహిళలను ముందు పెట్టి టిడిపి నాయకులు రాజకీయం చేస్తున్నారు=
మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ
 
రాజకీయాలకు ఇది సరైన వేదిక కాదు, మహిళా కమిషన్ అడ్డుకోవడం సరికాదు.

తాడేపల్లి కి చెందిన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పిన వాసిరెడ్డి పద్మ

విజయవాడ,13.2.2023... అందురాలైన బాలిక కు అన్యాయం జరిగితే ధైర్యం చెప్పేందుకు పరామర్శించడానికి వచ్చిన మహిళ కమిషన్ అడ్డుకునే హక్కు టిడిపి మహిళా కార్యకర్తలకు లేదు,  ఆందోళనలో రాజకీయాలు చేయవచ్చు కానీ ఇది సరైన సమయం కాదని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ  హితువు తెలిపారు..

కంటి చూపు లేని 17 సంవత్సరాల యువతని గంజాయి మత్తులో చంపిన ఘటన నేపద్యంలో బాధితురాలు కుటుంబ సభ్యులను ఈరోజు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నందు  మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు.

తాడేపల్లి లో ఈరోజు మైనర్ బాలిక హత్య జరగడం చాలా దారుణమైన హత్య ఇది. లైంగిక వేధింపులకి పాల్పడడం దాన్ని అడిగినటువంటి కుటుంబం మీద దాడి చేసేటటువంటి దానికి అతను రాజు అనే వ్యక్తి వచ్చి ఎవరూ లేని సమయంలో ఈ అమ్మాయి గొంతు కోయడం హాస్పిటల్ కి తీసుకువచ్చేలోపు చనిపోవడం అనేటటువంటిది ఇది అత్యంత దుర్మార్గమైన బాధాకరమైన సంఘటన. చాలా బాధేస్తుంది. ఆ తల్లి కనీసం మాట్లాడలేని పరిస్థితుల్లో చెబుతోంది జరిగినటువంటి విషయాలను చాలా పేద కుటుంబం. ఆ పాప కూడా పూర్తిగా కంటి చూపు కూడా లేనటువంటి అమ్మాయి.  ఆ అమ్మాయి మీద కన్నేసి, మళ్లీ అడిగితేనేమో అసలు అటువంటి ఉద్దేశమేమీ లేదని చెప్పి చంపడానికి తెగించడం అనేటటువంటిది మాత్రం ఇది ఒక రాక్షసుడు లాగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన దీని పట్ల  ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఆలోచిస్తుంది . స్పందించింది. నిందితుడికి కఠినమైన శిక్ష పడటానికి అదే విధంగా ఇటువంటివి పునరావృతం కాకుండా మనo ఎంత కఠినంగా వుండాలి అని మాట్లాడుతున్నాము, పోలీస్ డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడుతున్నాము.


ఒకే సారి రెండు సంఘటనలు జరగటం అనేది ఈరోజు చాలా ఆవేదన కలుగుతుంది. విజయవాడ నడిబోడ్డులో ఇలాగే వివాహితమే మీద కూడా ఇలాగే లైంగిక వేధింపులకు పాల్పడటం, తెలుగు దేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు. అది అడ్డుకున్నందుకు అడిగినందుకు ఆ కుటుంబం మీద దాడి చేసి మొత్తం కూడా ఆ అమ్మాయిని చంపబోతే అత్తా వీళ్ళందరూ కూడా అడ్డుపడినందుకు మొత్తం కత్తులతో నరికి వాళ్ళు నలుగురు కూడా ఇదే హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వున్నారు. ఆ సంఘటన పరామర్శకు వెళ్లి ధైర్యం చెప్పి ఇటువంటి రౌడీయిజం దీనికి సంబంధించినటువంటిది కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ తో మాట్లాడి ఆ ఏరియాలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయండి అని చెప్పి, రౌడీ షీట్ తో పాటు కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి సమయంలోనే ఇక్కడ తాడేపల్లిలో ప్రాణం దక్కకుండా చనిపోయిన ఈ పాప పరిస్థిని చూసిన తరువాత ఒకే లైంగిక వేధింపులను అడ్డుకోవడం కూడా నేరం అవుతున్నటువంటి ఒక సంఘటనను మనం చూస్తున్నాము. లైంగిక వేధింపులకు పాల్పడటము దాన్ని అడిగితే అడ్డుకుంటే ప్రాణాలు తీసేయటం, నరకడం అనేటటువంటి ఒక ఉన్మాదమైనటువంటి స్థాయికి ఈ రోజు వెళ్లిపోతున్నటువంటి సమయంలో మనందరం కూడా చాలా కఠినoగా వ్యవహరించాల్సిన అవసరమం వుంది.


ఇదే సందర్భములో మరొక విషయాన్ని కూడా నేను చెబుతున్నాను. రాజకీయం చేయడానికి కూడా పరిమితులు వుంటాయి. ఈ రోజు మహిళా కమిషన్ ఇక్కడ హాస్పిటల్ కి వచ్చి మార్చురీ దగ్గరకు వచ్చి మృతురాలి తల్లితో మాట్లాడే సమయంలో తెలుగు దేశం పార్టీకి సంబంధించిన కొంతమంది మహిళలు చేస్తున్న ఈ అల్లరిని నిజంగా ఎవరము కూడా ఉపేక్షించకూడదు. బాధితురాలి తల్లి ఆమె మాట్లాడలేక నీరసంగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు పెద్ద పెద్ద అరుపులతో మొత్తం కమ్మేసి.. అంటే కుటుంబాన్ని బెదరకొట్టే ప్రయత్నం. బాధితురాలు అసలే కూతుర్ని పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో వున్న కుటుంబానికి ఒక ఊరట, ఒక ఓదార్పుగా ఈ రోజు మనందరం నిలబడాల్సినటువంటి సమయంలో ఒక అరుపులతోటి గలాటా సృష్టించి రాజకీయం చేయాలనే ఉద్దేశ్యంతోటి ఆ కుటుంబాన్ని ఆ తల్లిని బెదరగొట్టడం.. ఎంతవరకు ఇది సమంజసమో ఒకసారి విజయవాడ పౌరులు ఆలోచించాలని చెప్పి కోరుతున్నాను. ఇక్కడ నేను హాస్పిటల్ లో బాధితురాలిని పరమర్శిస్తుంటే నేను మార్చురీకి వెళ్లి ఆ అమ్మాయి మృత దేహాన్ని, ఆ గాయాల్ని, ఎట్లా నరికాడు అని చూస్తున్నటువంటి సమయంలో అడ్డుకొని నేను మార్చురీకి వెళ్ళకూడదు అని లేకపోతే బాధితురాలి తల్లితో మాట్లాడకూడదు అని ఇంత యాగీ చేయడం అనేది సమంజసమేనా? తెలుగు దేశం పార్టీని నేను అడుగుతున్నాను. మహిళల్ని ముందు పెట్టి ఒక గలాటా రాజకీయం, ఒక చెత్త రాజకీయం చేయాలనేటటువంటి ప్రయత్నం, ఇదే హాస్పిటల్ లో ఇంతకుముందు కూడా ఇలాగే జరిగింది. 


మహిళా కమిషన్ చైర్పర్సన్ గా పరామర్శకు వస్తే చంద్రబాబు నాయుడు గారు అండ చూసుకొని ఆ రోజు కూడా మొత్తం తెలుగు దేశం పార్టీకి సంబంధించిన నాయకులందరు కూడా రౌడీలుగా రెచ్చిపోయారు. ఈ రోజున కూడా ఒక బాధితురాలి కుటుంబాన్ని పరామర్శిస్తూ వుంటే ఈ రాజకీయం ఏంటి. హాస్పిటల్ లో అసలు ఇంత దౌర్జన్యం  ఏమిటి? బయట మాట్లాడొచ్చు, ధర్నాలు చేయొచ్చు, రాజకీయం చేయడానికి కావలసినంత స్థలం బయట చాలా వుంది. కానీ హాస్పిటల్ దగ్గరకు వచ్చి రోగులు, డాక్టర్లు అందరు కూడా వుండే సమయంలో ఇంతింత అరుపులు అరిస్తే.. గుండెలు ఆగిపోతాయి. పేషెంట లు వుండే వాతావరణo ఇది. అరుపులేంటి ఆ రాజకీయo ఏంటి, ఇక్కడ నన్ను అడ్డుకొని మీరు సాధించేది ఏంటి. అసలు కనీసం ఇంగితం లేకుండా ఇట్లా ఎందుకు రాజకీయం చేస్తున్నారనేటటువంటిది ఆలోచించాల్సిన అవసరం వుంది. మహిళల్ని ముందు పెట్టుకోనా..ఇది  రాజకీయం. మీరు అడగండి, దీనికి సంబంధించిన విషయాలకు  న్యాయం కోసం పోరాడండి. అంతేతప్ప బాధితురాలి తల్లి ముందు లేకపోతే ఆ కుటుంబం ముందు ఇట్లా చేయడం వలన వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పడతారు, ఇక్కడ రోగులు ఇబ్బంది పడతారు. దయచేసి ఆ పరిస్థితిని సృష్టించడం అనేది భావ్యం కాదు. ఇది తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించిన విషయాలు మాట్లాడాల్సిన సందర్భంలో ఇక్కడ హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఇంత అన్యాయంగా వ్యవహరిస్తూ వుంటే, మీరెలా వ్యవహరిస్తే అట్లా చెల్లుతుంది అనుకుంటున్నారా? చాలా దుర్మార్గమైన చెత్త రాజకీయం పనికిమాలిన రాజకీయం చేస్తున్నారు. మీకు ప్రజలు బుద్ది చెప్పే సమయం తొందరలోనే వస్తుంది.



More Press News