మహిళలకి, ఏజెంట్లకి ప్రత్యేక ఆఫర్లతో 2023 మార్చి నెలని ఐసిఐసిఐ లాంబార్డ్ మహిళా మాసంగా పాటిస్తోంది

-        దేశవ్యాప్తంగా మహిళలకి ఆరోగ్య తనిఖీలు, మోటార్ అసిస్టెన్స్ అందిస్తోంది
-        ఐఎల్ మహిళా ఏజెంట్లకి సమగ్ర పరిచయ వర్క్‪షాప్‪లు
 
మార్చి 07, 2023: భారతదేశపు ప్రముఖ బీమా సంస్థ అయిన ఐసిఐసిఐ లాంబార్డ్, శారీరక, ఆర్థిక ఆరోగ్యవిషయాల్లో మహిళలకు అధికారం కలిగించే కృషిలో భాగంగా మార్చి నెలని మహిళా మాసంగా పాటిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ కాంప్లిమెంటరీ హెల్త్ చెకప్ లని అందిస్తోంది, భారతదేశవ్యాప్తంగా, అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ మొదట వచ్చినవారికి మొదట అనే ప్రాతిపదికన 10,000 మంది మహిళలకి ఈ అవకాశం అందుబాటులో  వుంటుంది. అంతేకాక, మహిళా వ్యాపారసమారంభత్వాన్ని ప్రోత్సహించేందుకుగాను, మహిళా ఏజెంట్లు & బ్రోకర్లని చేర్చుకుని, వారికి విషయజ్ఞానం అందించేందుకు సమగ్ర శిక్షణా కార్యక్రమం అందించాలని కంపెనీ సంకల్పించింది. ఈ మాసం మొత్తం, మహిళలు రోడ్‪సైడ్ అసిస్టెన్స్ సర్వీస్ (ఆర్ఎస్ఎ)ని కూడా వినియోగించుకోవచ్చు.

ఈ చొరవలో భాగంగా, హెల్త్ డయాగ్నస్టిక్ చెకప్ ల్లో సిబిసి, థైరాయిడ్ ప్రొఫైల్, విటమిన్ డి, బి12, పెర్రాటిన్ (ఐరన్ స్టడీ)లు నిర్వహిస్తారు. భారతదేశ వ్యాప్తంగా మహిళలు ఐఎల్ కేట్ కేర్ ఆప్ ద్వారా ఈ సేవల్ని పొందవచ్చు. వారి ఆరోగ్య, బీమా అవసరాల్ని నిర్వహించుకోడానికి ఈ వేదిక చాలా సౌకర్యంగా, ఉపయోగించడానికి సులువుగా వుంటుంది.

దీంతోపాటుగా ఈ బీమా సంస్థ, మహిళా మోటారిస్టులు కాంప్లిమెంటరీ రోడ్‪సైడ్ అసిస్టెన్స్ సేవలు (ఆర్ఎస్ఎ)ని కూడా పొందవచ్చు. అసాధారణ సమయాల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారు పాడైపోవడం, ప్రమాదాలు, టైర్లు పేలిపోవడం, ఇంధన నష్టం, ఎలక్ట్రికల్ వైఫల్యాలు వుంటి సమస్యలు ఎదురైనప్పుడు మహిళలు ఈ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఈ నెల మొత్తం మహిళా మోటారిస్ట్ లు సహాయం కోసం ఐఎల్ కస్టమర్ కేర్ కు కాల్ చేయవచ్చు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్‪హెచ్ఎస్-5) ప్రకారం, భారతదేశంలో 15-49 ఏళ్ళ మధ్య వున్న మహిళల్లో కేవలం 30% మంది మాత్రమే హెల్త్ కవరేజ్ పొందుతున్నారు. అంటే, మహిళా జనాభాలో చాలా ఎక్కువ భాగం మందికి ఆరోగ్య బీమా లేదు, చైతన్యం లేకపోవడం, ఆర్థిక విషయాల మీద అవగాహన, అందుబాటులేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈరోజున, మహిళలు సోపానంలో మీదకి ఎదిగివచ్చి ఆర్థిక రంగంలో ప్రతి విభాగంలోనూ తమదైన ముద్రవేయడానికి ఉరకలెత్తుతున్న సందర్భంలో, వాళ్ళని ఆరోగ్య బీమా విభాగంలోకి తీసుకువచ్చి, కేవలం వారి ఆరోగ్యాన్ని మాత్రమేకాక, ఆర్థిక ఆరోగ్యానికి కూడా భద్రత కల్పించడం, కుటుంబంలోనూ, సమాజంలోనూ వారి విలువైన కృషి కొనసాగేలా చూడ్డం ప్రధానమైన విషయం.

సంజీవ్ మంత్రి, ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్, ఐసిఐసిఐ లాంబార్డ్, ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఐసిఐసిఐ లాంబార్డ్ లో మేము, శారీరక, ఆర్థిక విషయాల్లో రెండింటిలోనూ మహిళల ఆరోగ్యంపై మేం ప్రత్యేక దృష్టిపెడుతున్నాం. సాంప్రదాయికంగా, యావత్ కుటుంబ ఆరోగ్యసంరక్షణని చూసుకునే మహిళలు, వారి స్వంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం (ఐడబ్ల్యుడి) సందర్భంలో, ఒక కంపెనీగా మేము, వారి నిర్వరామ కృషిని గుర్తించి, ఆరోగ్యపరంగా ఈ చొరవల ద్వారా వారిలో వీటికి సంబంధించి చైతన్యాన్ని కలిగించదల్చుకున్నాం. దీనికితోడు, మహిళల్లో దీనికి సంబంధించిన చొరవ తక్కువ, అంచేత, తమ బీమా, ఆర్థిక విషయాల్లో చురుగ్గా పాల్గొని నిర్ణయాలు తీసుకునే దిశగా మహిళల్ని ప్రోత్సహించి, మార్పుని వేగవంతం చేసేందుకు మేం కృషి చేస్తున్నాం” అన్నారు.

భారతదేశంలో సాధారణ బీమా విషయంలో మహిళల చైతన్యం, వైఖరిపై ఐసిఐసిఐ లాంబార్డ్ ఇటీవల నిర్వహించిన సర్వే, మహిళలు బీమా ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడంలో పాత్రవహిస్తున్న కొన్ని విషయాలని గమనించింది. ఆ సర్వే ప్రకారం, ఆర్థికంగా స్వతంత్రం వున్న, 40 ఏళ్ళకు పైబడిన మహిళల్లో 60% శాతం మంది సాధారణ బీమా ఉత్పత్తులు కొన్నట్టు తేలింది.
మహిళలు వారి ఆర్థిక విషయాలపై వారే నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించడం కోసం, ఈ రిపోర్టు వెల్లడించిన అంశాల ఆధారంగా బీమా, ఆర్థిక విషయాల పై ప్రత్యేక అవసరాలతో తయారు చేసిన కార్యక్కరమాలకోసం మహిళా ఏజెంట్లని ఐసిఐసిఐ లాంబార్డ్ తీసుకుటోంది. మహిళలకోసం ఉద్దేశించిన ఈ ప్రత్యేక సౌలక్ష్యతలు, బీమా పాలసీల వల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరించి, చైతన్యం కలిగించేవిగా వుంటాయి. తన ఉద్యోగులు, ఖాతాదారులు, ఏజెంట్లు, ఛానెల్ భాగస్వాములకు సమగ్ర, వైవిధ్య పర్యావరణం కలిగించాలన్న కంపెనీ దృష్టికోణాన్ని అనుసరించే ఈ చొరవలు వుంటాయి.

More Press News