ప్రజల సందర్శన కోసం రాష్ట్రపతి నిలయం .... పాల్గొన్న రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ....

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచనల మేరకు రాష్ట్రపతి నిలయాన్ని ప్రజల సందర్శన కోసం వీలు కల్పిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్త మిలిసై సౌందర రాజన్, కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పాల్గొన్నారు. హైదరాబాదులోని రాష్ట్రపతి నిలయంలో బుధవారం నాడు జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనగా హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో హోం మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.... భారత రాష్ట్రపతి హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయాన్ని ఏడాది పొడవునా సాధారణ ప్రజలు సందర్శించే లా వీలు కల్పించే ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానన్నారు.

 ఉగాది శుభదినమని, తెలుగు ప్రజలకు నూతన సంవత్సరం ప్రారంభం రోజున భారత రాష్ట్రపతి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో భారత రాష్ట్రపతి హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో క్యాంప్ చేస్తారనే విషయం విదితమే నన్నారు. రాష్ట్రపతి నిలయం సందర్శకుల కోసం పునరుద్ధరించబడిందనీ, 162 సంవత్సరాల పురాతన ఐకానిక్ హెరిటేజ్బి ల్డింగ్ సందర్శకులకు మొదటిసారిగా తెరవబడిందనీ,97 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఉద్యానవనాలు, ఆర్ట్ గ్యాలరీ & భూగర్భ సొరంగం వంటివి ప్రధాన
ఆకర్షణలు అన్నారు.జై హింద్ ర్యాంప్ పునరుద్ధరణ మరియు చారిత్రాత్మక ఫ్లాగ్పో స్ట్ నమూనా నిర్మాణానికి భారత రాష్ట్రపతి శంకుస్థాపన చేయడం పట్ల ఆనందం వెలిబుచ్చారు .పర్యాటకుల కోసం గోల్ఫ్ కార్ట్‌లు, క్యాంటీన్‌లు మొదలైన అన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల హైదరాబాద్‌లో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నా, రాష్ట్రపతి నిలయం ఖచ్చితంగా మరొక పర్యాటక ఆకర్షణగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో సందర్శకులకు  రవాణా  మరియు ఇతర సౌకర్యాలు కల్పించేలా చూస్తామన్నారు.

More Press News