కేర్‌గివర్స్‌ సమావేశం నిర్వహించిన భారతదేశపు అతిపెద్ద క్రౌడ్‌ఫండింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ మిలాప్‌

విజయవాడ, మార్చి 2023 : భారతదేశంలో అతి పెద్ద, విశ్వసనీయ క్రౌడ్‌ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ మిలాప్‌ డాట్‌ ఓఆర్‌జీ (https://milaap.org/) నగరంలో  కేర్‌ గివర్స్‌ సమావేశం నిర్వహించింది. ప్రస్తుతం వైద్య అత్యవసరాలు కలిగిన వ్యక్తులు లేదంటే  వారి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు సంక్షోభ సమయంలో ఆర్థిక మద్దతును పొందేందుకు ఆధారపడతగిన వనరుగా క్రౌడ్‌ ఫండింగ్‌ను  ఏ  విధంగా వినియోగించవచ్చో అర్ధం చేసుకునే అవకాశం దీని ద్వారా కలిగింది.  నోరి హాస్పిటల్స్‌కు చెందిన సుప్రసిద్ధ పిడియాట్రిషియన్‌ డాక్టర్‌ నోరి సూర్యనారాయణ ఈ క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ గురించి మాట్లాడటంతో పాటుగా అవి ఏ విధంగా చికిత్స సమయంలో తోడ్పడతాయో వెల్లడించారు.


డాక్టర్‌ నోరి మాట్లాడుతూ క్రౌడ్‌ ఫండింగ్‌ అనేది అత్యంత విశ్వసనీయమైన ఆర్థిక అవకాశంగా నిలుస్తుందంటూ మరీ ముఖ్యంగా ఆరోగ్య భీమా అవకాశాలు అతి తక్కువగా లభించే నవజాత శిశువుల చికిత్సలో అది తోడ్పడుతుందన్నారు. ఆయన మాట్లాడుతూ తమ హాస్పిటల్‌కు అత్యంత నమ్మకమైన భాగస్వామిగా సుదీర్ఘకాలంగా మిలాప్‌  నిలుస్తుందంటూ, సంయుక్తంగా పలువురు రోగులకు విజయవంతంగా చికిత్స చేశామన్నారు.


 నెలలు నిండకుండానే పుట్టిన కవల  పిల్లల చికిత్స కోసం మిలాప్‌ క్రౌడ్‌ ఫండింగ్‌పై ఫండ్‌ రైజ్‌ చేసిన ప్రవీణ్‌ కుమార్‌ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఆయన మాట్లాడుతూ తమ పిల్లల చికిత్సకు దాదాపు 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. తన కుమార్తెలకు మంచి జరగాలనే కోరికతో మిలాప్‌పై ఫండ్‌ రైజింగ్‌ చేయడం ప్రారంభించాను. కేవలం 20 రోజులలో 26 లక్షల రూపాయలను సమీకరించగలిగాను. విజయవంతంగా వారికి చికిత్స అందించగలిగామన్నారు.


క్రౌడ్‌ ఫండింగ్‌ తమ లాంటి వారికి ఎంతో మేలు చేస్తుందన్న ఆయన, మనకు అవకాశం లేని సమయంలో  సహాయం కోసం ఇతరులను అడగడానికి సిగ్గు పడకూడదన్నారు.

ఒకవేళ మీకు ఏదైనా వైద్య అత్యవసరం  పడి,  నిధుల కొరత ఎదుర్కొంటుంటే మీ ఫండ్‌ రైజర్‌ను  https://milaap.org/వినియోగించి ప్రారంభించండి.

--


More Press News