రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఆర్.ఏం. డోబ్రియాల్

పూర్తి స్థాయి అటవీ సంరక్షణ ప్రధాన అధికారిగా (పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్ నియామకం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి & అటవీ దళాల అధిపతిగా (Principal Chief Conservator of Forests (PCCF) & Head of Forest Force (HoFF) రాకేష్ మోహన్డో బ్రియాల్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత యేడాది ఫిబ్రవరిలో అప్పటి ప్రధాన అధికారి పదవీ విరమణ అనంతరం డోబ్రియాల్ కు పీసీసీఎఫ్ గా పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.


తాజాగా పూర్తి స్థాయి అటవీ సంరక్షణ ప్రధాన అధికారిగా ఆయననే కొనసాగిస్తూ చీఫ్ సెక్రటరీ ఏ. శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ అరణ్య భవన్ లో ఆర్.ఏం. డోబ్రియాల్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లకు డోబ్రియాల్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యతకు అనుగుణంగా, హరిత తెలంగాణ సాధనకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది పనిచేస్తామని అన్నారు.

More Press News