సేవా దృక్పథం తో పనిచేస్తున్న వాలంటీర్లకు కృతజ్ఞతలు- పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వేలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో 37,39,40,41,మరియు 42, డివిజన్లలో గల 190 మందికి
వార్డు వాలంటీర్ల ప్రశంసా పత్రాలు ఇచ్చి శాలువ కప్పి సత్కరించి అభినందించడం జరిగినది.
సేవా రత్న 02 మందికి ..సేవా మిత్ర 188 మందికి ది.23-05-2023వ తేదిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో కుమ్మరిపాలెం సెంటర్, షాదిఖానా నందు నిర్వహించిన వాలంటీర్ కు వందనం కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ వేలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాట్లాడుతూ అర్హులను నేరుగా గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందచెయ్యడంలో వాలంటీర్ సమర్ధవంతముగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రతి వాలంటీర్ వారి యొక్క సేవలను ప్రజలకు మరింత చేరవేసి, జాతి, మత, కుల, ప్రాంతీయ భేదాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పథకాల లబ్ది చేకూర్చాలనే ఉన్నతమైన ఆశయముతో ఏర్పాటైన ఈ వ్యవస్థకు మరింత విస్తృతమైన సేవలను ప్రజలకు అందించే దిశలో ఆర్థిక ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాల లబ్ది అందచెయ్యడం, అర్హులైన లబ్దిదారులను గుర్తించి వారిచే ధరఖాస్తు చేయించి, ఆఫీసుల చుట్టూ తిరగకుండా వాలంటీర్ ఉత్తమమైన సేవలు అందించి, ఒక కుటుంబ సభ్యునిగా గుర్తింపు పొందడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతినెలా ఒకటవ తేదీన పెన్షన్ పంపిణీ ఉదయం 6 నుంచి చేపట్టి మధ్యాహ్నంకు అందజేస్తూ, విధి నిర్వహణలో మమేకం అవుతున్నట్లు శాసనసభ్యులు శ్రీ వేలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రశంసించారు.
ఈ కార్యాక్రమములో కార్పొరేటర్లు గుడివాడ నరేంద్ర రాఘవ, యరడ్ల ఆంజనేయ రెడ్డి, మొహమ్మద్ ఇర్ఫాన్ మరియు ఇతర అధికారులు స్థానిక పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.