50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌తో జీ 5లో దూసుకెళ్తోన్న ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘విమానం’
సినిమాలు, వెబ్ సిరీస్, టాక్ షోస్‌తో వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్ హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ మాధ్యమం జీ 5. ఇప్పుడు జీ 5 లైబ్రరీలో డిఫరెంట్ మూవీగా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘విమానం’ మూవీ చేరింది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్) ‘విమానం’ చిత్రాన్ని నిర్మించారు జూన్ 22 నుంచి ‘విమానం’ సినిమా జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం, ప్రేమానురాగాలు ప్రధానంగా తెరకెక్కిన మూవీ ఇది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకోవటమే కాకుండా ఈ మధ్య కాలంలో ఇంతలా హార్ట్ టచింగ్ మూవీ రాలేదని అందరూ అప్రిషియేట్ చేశారు. అందరినీ అలరిస్తూ 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌తో సినిమా దూసుకెళ్తోంది.
హైదరాబాద్ బస్తీలో వీరయ్య (సముద్రఖని) అనే వ్యక్తికి కాలు ఉండదు. భార్య చనిపోవటంతో ఒక్కాగానొక్క కొడుకు (మాస్టర్ ధ్రువన్)ని ఎంతో ప్రేమగా పెంచుకుంటాడు. ఆ చిన్న పిల్లాడికి విమానం ఎక్కాలనే కోరిక ఉంటుంది. బాగా చదువుకుంటే విమానం ఎక్కవచ్చునని వీరయ్య కొడుకుతో చెబుతూ ఉంటాడు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో వారి జీవితాలు అనుకోని ఘటనతో మలుపులు తిరుగుతాయి. కొడుకుని విమానం ఎక్కించాలని వీరయ్య ఎంతో తపన పడుతుంటాడు. అసలు వీరయ్య అలా చేయటానికి కారణమేంటి? కొడుకు కోరికను వీరయ్య తీర్చాడా? వీరయ్యతో పాటు అదే కాలనీలో ఉండే కోటి, సుమతి, డేనియల్ ఏం చేస్తుంటారు? అనేదే విమానం సినిమా.
డైరెక్టర్ శివ ప్రసాద్ యానాల టేకింగ్, చరణ్ అర్జున్ సంగీతం, వివేక్ కాలేపు సినిమాటోగ్రఫీ సినిమాను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి.
జీ5 గురించి....
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలి ఇలా ఇతర భాషల్లో ఉన్న గొప్ప కంటెంట్‌ను జీ5 నిత్యం ఆడియెన్స్‌కు అందిస్తూనే ఉంది. దేశ వ్యాప్తంగా జీ5కి మంచి కంటెంట్ అందిస్తుందనే పేరు ఉందన్న సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మీద నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన లూసర్ 2, బీబీసీ స్టూడియో, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన గాలివాన, రెక్కి, హలో వరల్డ్, మా నీళ్ల ట్యాంగ్, అహనా పెళ్లంట, ఏటీఎం, పులి మేక, వ్యవస్థ ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడు ఈ లిస్టులో విమానం సినిమా చేరింది.