వెల్‌డ‌న్‌ వైభ‌వ్‌.. యువ సంచ‌ల‌నాన్ని అభినందించిన కావ్య మారన్.. వీడియో వైరల్!

Kavya Maran Applauds Vaibhav Suryavanshi Viral Video
  • ఐపీఎల్ ఎలిమినేటర్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
  • 29 బంతుల్లో 97 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్
  • మ్యాచ్ అనంతరం వైభవ్‌ను ప్రత్యేకంగా అభినందించిన కావ్య మారన్
  • ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
  • వైభవ్ అరుదైన టాలెంట్ అంటూ కితాబిచ్చిన ఎస్‌ఆర్‌హెచ్ కోచ్
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. నిన్న‌ సన్‌రైజర్స్ హైదరాబాద్ ( ఎస్ఆర్‌హెచ్‌)తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడి అసాధారణ ఆటతీరు ప్రత్యర్థి జట్టు యాజమాన్యాన్ని సైతం ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా ఎస్‌ఆర్‌హెచ్ సహ యజమాని కావ్య మారన్ చూపిన క్రీడా స్ఫూర్తి అందరినీ ఆకట్టుకుంది.

మ్యాచ్ అనంతరం కావ్య మారన్ స్వయంగా వైభవ్ వద్దకు వెళ్లి అతడిని ప్రత్యేకంగా అభినందించారు. యువ ఆటగాడితో కరచాలనం చేసి, ప్రశంసలు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రత్యర్థి జట్టు ఆటగాడిని ప్రోత్సహించిన కావ్య తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇలాంటి టాలెంట్‌ను చూడలేదు: జేమ్స్ ఫ్రాంక్లిన్ 
మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్ అసిస్టెంట్ కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ సైతం వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాచ్ అనంతరం ఫ్రాంక్లిన్ మాట్లాడుతూ.. "బహుశా ఇలాంటి టాలెంట్‌ను ఎవరూ చూసి ఉండరు. అతను చేస్తున్నది నమ్మశక్యంగా లేదు. అతనికి ఇంకా 25 ఏళ్ల కెరీర్ మిగిలి ఉందని ఊహించుకుంటేనే భయంగా ఉంది. భవిష్యత్తులో అతను మరింత మెరుగవుతాడు. మరింత బలంగా తయారవుతాడు" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Kavya Maran
Vaibhav Suryavanshi
IPL 2026
Sunrisers Hyderabad
Rajasthan Royals
James Franklin
SRH
RR
Cricket
Indian Premier League

More Telugu News