ఆ పొలాలను కొనుగోలు చేసిన తర్వాతే విద్యుత్ టవర్లు వేయండి: పేర్ని నాని
- కొత్తపూడి గ్రామంలో విద్యుత్ టవర్ల కోసం మార్కింగ్ వేసిన అధికారులు
- దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన రైతులు
- రైతులను కలిసి సమస్యలు తెలుసుకున్న పేర్ని నాని
- ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండానే మార్కింగ్ వేశారని విమర్శ
హై ఓల్టేజ్ విద్యుత్ లైన్ల కారణంగా తమ భూములకు విలువ పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. మచిలీపట్నం సమీపంలోని కొత్తపూడి గ్రామంలో పోర్టు కోసం విద్యుత్ టవర్ల కోసం అధికారులు మార్కింగ్ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ఈ రోజు ఆ గ్రామానికి వెళ్లిన పేర్ని నాని రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ... 1994-95లో కొత్తపూడి గ్రామంలోని దళిత, పేద కుటుంబాలకు ప్రభుత్వం పట్టాల రూపంలో భూమి ఇచ్చిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పట్టాలన్నింటినీ ఫ్రీ హోల్డ్ గా మార్చేశారని వెల్లడించారు. ఇప్పుడు పోర్టు అవసరాల కోసం ఆ పొలాల్లో హెవీ విద్యుత్ లైన్ టవర్లను వేయడానికి అధికారులు మార్కింగ్ వేశారని తెలిపారు. రైతులకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండానే మార్కింగ్ వేశారని విమర్శించారు. హై ఓల్టేజ్ విద్యుత్ టవర్ల కారణంగా తమ భూములకు విలువ తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
హై ఓల్టేజ్ విద్యుత్ టవర్లు వేయాలనుకుంటే... ఆ పాలాలను పూర్తిగా కొనుగోలు చేయాలని పేర్ని నాని అన్నారు. ఈ గ్రామ రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.