మహానాడు సంచలన రికార్డు సృష్టించింది: నారా లోకేశ్

Nara Lokesh Says Mahanadu Creates Sensation Record
  • మహానాడుకు 11 లక్షల మంది హాజరయ్యారన్న నారా లోకేశ్
  • వీరంతా ఈ-అటెండెన్స్ లో నమోదు చేయించుకున్నారని వెల్లడి
  • అన్ని నియోజకవర్గాల్లో మహిళా నాయకత్వాన్ని తయారు చేస్తామన్న లోకేశ్
  • రాజారెడ్డి అరాచకాలను ప్రజలకు తెలియజేసిన ఘనత జగన్ దేనని వ్యాఖ్య
తొలిసారి హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్న మహానాడు సంచలన రికార్డు సృష్టించిందని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మహానాడు కార్యక్రమాలకు 11 లక్షల మంది క్యాడర్ హాజరయ్యారని ఆయన వెల్లడించారు. ఈ-అటెండెన్స్ లో వీరంతా నమోదు చేయించుకున్నారని తెలిపారు. మహానాడులో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆయన ఈ వివరాలను వెల్లడించారు. 

పార్టీలో ఎప్పటికప్పుడు సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉందని లోకేశ్ అన్నారు. ఎన్టీఆర్ కాలం నుంచే ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. సిద్ధాంత పరంగానే తాము సంస్కరణలు తీసుకొస్తున్నామని... ఎన్నికల కోసం కాదని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే మహిళా నాయకత్వాన్ని తయారు చేస్తామని వెల్లడించారు. జెన్ జీ యువత ఏం ఆశిస్తుందో ఆలోచించి దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉందని చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉందని లోకేశ్ తెలిపారు. జగన్ మాదిరి తాము ఏకపక్షంగా ఏకగ్రీవాలు చేసుకోబోమని చెప్పారు. టీడీపీ ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు సాగుతుందని అన్నారు. జగన్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల పేపర్లను లాక్కుని ఎలాంటి అరాచకాలకు పాల్పడ్డారో అందరం చూశామని చెప్పారు. డీఎస్సీపై జగన్ వేయించిన కేసులన్నింటినీ కోర్టు కొట్టివేసిందని తెలిపారు. 

జగన్ తన కుటుంబ చరిత్రను తానే తవ్వి తీయించారని లోకేశ్ ఎద్దేవా చేశారు. రాజారెడ్డి అరాచకాలు, బెరైటీస్ గనుల కోసం చేసిన హత్యలు అన్నింటినీ ప్రజలకు తెలియజేసిన ఘనత జగన్ దేనని అన్నారు.
Go Back to Shorts
Nara Lokesh
Mahanadu
TDP
Telugu Desam Party
Andhra Pradesh Politics
Hybrid Model
Local Body Elections
YS Jagan Mohan Reddy
DSC
Reforms

More Telugu News