వ్యవసాయం కోసం ఉద్యోగం వదిలిన టెక్కీ.. తోటలో పిడుగుపాటుకు గురై మృతి

Former IT Employee Roshan Balakrishna Dies in Lightning Strike While Visiting Farm
  • మైసూరులోని తన వ్యవసాయ క్షేత్రంలో మృతి చెందిన టెక్కీ రోషన్ బాలకృష్ణ
  • వ్యవసాయంపై ఆసక్తితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా
  • స్నేహితుడితో కలిసి వ్యవసాయం ప్రారంభించిన రోషన్
కర్ణాటకకు చెందిన 43 సంవత్సరాల మాజీ టెక్కీ కమ్ రైతు తన కుటుంబంతో కలిసి మైసూరులోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తుండగా పిడుగుపాటుకు గురై మరణించాడు. మడికెరె పట్టణానికి చెందిన 43 సంవత్సరాల రోషన్ బాలకృష్ణ అనే ఐటీ ఉద్యోగి వ్యవసాయంపై ఆసక్తితో ఇటీవల తన ఉద్యోగాన్ని వదిలేశాడు. స్నేహితుడితో కలిసి వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. అతను ఆధునిక వ్యవసాయ పరికరాల మార్కెటింగ్ కూడా చేస్తున్నాడు.

సాగునీటి ప్రణాళికల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి మైసూరులోని తన పొలం చూసేందుకు వెళ్లాడు. ఓ మామిడి చెట్టు వద్ద పండ్లు కోయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో భారీ వర్షంతో పాటు పిడుగు పడింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.5 లక్షల పరిహారం ప్రకటించాయి. 
Go Back to Shorts
Roshan Balakrishna
Karnataka
Mysore
lightning strike
farmer death
agriculture
IT professional

More Telugu News