ఆస్ట్రేలియాలో లక్ష బొద్దింకల స్వాధీనం.. ఆ దేశ‌ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్

Australia Seizes One Lakh Cockroaches In Biggest Operation In History
  • మడగాస్కర్, డూబియా జాతులకు చెందిన ఈ బొద్దింకలను పెంచడంపై దేశంలో నిషేధం 
  • పెంపుడు సరీసృపాల ఆహారం కోసం వీటిని అక్రమంగా అమ్ముతున్నట్లు అనుమానం
  • దేశ జీవవైవిధ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండటంతో వీటిపై కఠిన నిబంధనలు
  • స్వాధీనం చేసుకున్న బొద్దింకలకు కారుణ్య మరణం విధించనున్నట్లు తెలిపిన‌ అధికారులు
ఆస్ట్రేలియాలో అధికారులు జరిపిన ఒక భారీ ఆపరేషన్‌లో లక్షకు పైగా అక్రమ బొద్దింకలను స్వాధీనం చేసుకున్నారు. దేశంలోకి దిగుమతి చేసుకోవడం లేదా పెంచడంపై నిషేధం ఉన్న ఈ బొద్దింకలను ఒకే బ్రీడర్ నుంచి పట్టుకోవడం సంచలనం సృష్టిస్తోంది. దేశ చరిత్రలో అకశేరుకాలకు (వెన్నెముక లేని జీవులు) సంబంధించి ఇదే అతిపెద్ద ఆపరేషన్ అధికారులు వెల్లడించారు.

న్యూసౌత్ వేల్స్‌ రాష్ట్రంలోని బాథర్స్ట్ నగరంలో మే నెలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక కమర్షియల్ బ్రీడర్ వద్ద జరిపిన సోదాల్లో మడగాస్కర్ హిస్సింగ్, డూబియా జాతులకు చెందిన లక్షకు పైగా బొద్దింకలను గుర్తించినట్లు ఆస్ట్రేలియా పర్యావరణ విభాగం తెలిపింది. వీటి విలువ సుమారు 200,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 1.35 కోట్లు) ఉంటుందని అంచనా.

ఈ మడగాస్కర్ బొద్దింకలు ప్రపంచంలోనే అతిపెద్ద జాతులలో ఒకటి. ఇవి 5 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. సాధారణ ఆస్ట్రేలియన్ బొద్దింకల కన్నా ఇవి చాలా పెద్దవి. స్థానికంగా పాములను పట్టే స్టెఫానీ లెస్సర్ మాట్లాడుతూ, పెంపుడు సరీసృపాలకు తక్కువ ఖర్చుతో కూడిన ఆహారం అందించేందుకు ఈ పెద్ద బొద్దింకలను అమ్ముతున్నారని అభిప్రాయపడ్డారు.

ఆస్ట్రేలియాలో కఠినమైన బయోసెక్యూరిటీ నిబంధనలు అమల్లో ఉన్నాయి. దేశీయ వృక్ష, జంతుజాలాన్ని కాపాడేందుకు ఇలాంటి విదేశీ జీవులను పెంచడం, అమ్మడం చట్టవిరుద్ధం. విదేశీ బొద్దింకలు పర్యావరణానికి ప్రమాదకరం కావచ్చని, స్థానిక జీవవైవిధ్యానికి హాని కలిగించడంతో పాటు వ్యాధులను వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అయితే, బాథర్స్ట్‌కు చెందిన బ్రీడర్‌పై ప్రస్తుతానికి ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బొద్దింకలన్నింటికీ కారుణ్య మరణం విధించనున్నట్లు వారు పేర్కొన్నారు.
Go Back to Shorts
Australia
Madagascar Hissing Cockroaches
Dubia Cockroaches
Illegal Wildlife Seizure
Bathurst New South Wales
Australia Biosecurity Laws
Invertebrate Operation
Environmental Protection
Exotic Species Seizure
Pet Reptile Food

More Telugu News