'అర్జున్ రెడ్డి'కి ముందు ఈ రోజు గడిస్తే చాలు అనుకునేవాడిని: కమెడియన్ రాహుల్ రామకృష్ణ

  • అమ్మానాన్నలను డబ్బులు అడక్కూడదనుకున్నాను 
  • చిన్నాచితకా పనులు చాలా చేశాను 
  • 'అర్జున్ రెడ్డి' తరువాత వెనుదిరిగి చూసుకోలేదన్న రాహుల్ రామకృష్ణ
తెలుగు తెరపై సందడి చేస్తున్న కమెడియన్స్ లో రాహుల్ రామకృష్ణ ఒకరు. తనదైన డైలాగ్ డెలివరీతో .. బాడీ లాంగ్వేజ్ తో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "కాలేజ్ రోజులు పూర్తయిన తరువాత, ఇక ఇంట్లో వాళ్లను డబ్బులు అడగకూడదని అనుకున్నాను. అందుకోసం చిన్నాచితకా పనులు చాలా చేశాను.

ఈ రోజు గడిస్తే చాలు అనుకునేవాడిని .. గడిచిన తరువాత 'రేపు ఎలా' అని ఆలోచించేవాడిని. రిపోర్టర్ గా .. ఫ్రీలాన్స్ రైటర్ గా పని చేశాను. అలా నెమ్మదిగా నటన వైపుకు వెళ్లాను .. 'అర్జున్ రెడ్డి' సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా సమయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చాలా టెన్షన్స్ లో ఉండేవాడు. ఆయన తన కష్టాలను నాతో చెప్పుకునేవాడు. టెన్షన్ వద్దు .. అంతా మంచే జరుగుతుందని చెప్పేవాడిని. 'అర్జున్ రెడ్డి' సినిమా విడుదలైన తరువాత, ఆ రెస్పాన్స్ ను చూసి నేను షాక్ అయ్యాను. నాకు కూడా మంచి పేరు వచ్చింది. ఆ సినిమా తరువాత నేను వెనుదిరిగి చూసుకోలేదు" అని చెప్పుకొచ్చాడు.


More Telugu News