పెరిగిన చలితో తిరుమలలో ఇబ్బందులు!
- అద్దె గదులు దొరక్క అవస్థ
- భక్తుల రద్దీ సాధారణం
- శనివారం నాడు రూ. 2.52 కోట్ల హుండీ ఆదాయం
పెరిగిన చలి తీవ్రతతో తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అద్దె గదులు దొరకని వారు పిల్లా పాపలతో షెడ్ల కిందే తలదాచుకోవాల్సి రావడంతో చలిలో అల్లాడుతున్నారు. ఇక ఈ ఉదయం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వ దర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివుండగా, దర్శనానికి ఆరు నుంచి 8 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం, రూ. 300 ప్రత్యేక దర్శనం, టైమ్ స్లాట్ టోకెన్ పొందిన వారికి 3 గంటల్లోనే దర్శనం పూర్తవుతోంది. నిన్న స్వామివారిని సుమారు 70 వేల మంది భక్తులు దర్శించుకోగా, రూ. 2.52 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.