విజయ్ దేవరకొండ గుర్తించిన ఆణిముత్యం... గోల్డ్ మెడల్ సాధించిన గణేశ్!
- మెదక్ కు చెందిన గణేశ్ కిక్ బాక్సింగ్ కు సాయపడ్డ విజయ్
- ఢిల్లీకి వెళ్లి ఫైనల్స్ లో విజయం సాధించిన గణేశ్
- గర్వంగా ఉందని వ్యాఖ్యానించిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ గుర్తించిన ఓ ఆణిముత్యం, అతనిచ్చిన ప్రోత్సాహంతో కిక్ బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ ను తీసుకుని, తనపై 'రౌడీ' పెట్టుకున్న నమ్మకాన్ని నిలిపాడు. మెదక్ జిల్లాకు చెందిన గణేశ్ అనే యువకుడు, న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనాలని భావించాడు. ఎంట్రీ ఫీజు కోసం డబ్బు లేక ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకున్న విజయ్ దేవరకొండ, తాను నిర్వహిస్తున్న దేవర ఫౌండేషన్ ద్వారా గణేశ్ కు సాయపడ్డారు. విజయ్ ఇచ్చిన డబ్బుతో ఢిల్లీకి వెళ్లిన గణేశ్, పైనల్స్ లో విజయం సాధించి బంగారు పతకాన్ని సాధించాడు.
ఈ సందర్భంగా విజయ్ కి కృతజ్ఞతలు తెలిపిన గణేశ్, మీ ఆర్థిక సాయం, మద్దతు లేకుంటే ఈ విజయాన్ని సాధించి వుండేవాడిని కాదని చెప్పాడు. మీరే రియల్ హీరో అని కొనియాడారు. ఇక గణేశ్ విజయం సాధించాడని తెలుసుకున్న విజయ్ దేవరకొండ సైతం, నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందని, నిన్ను కలవాలని ఉందని సమాధానాన్ని పంపారు. 'రౌడీ' ఫ్యామిలీలోకి వెల్ కమ్ చెబుతున్నానని అంటూ గణేశ్ ను అభినందించారు.