అసలైన టెస్టు ఇప్పుడే మొదలైంది: అశ్విన్

  • వెల్లింగ్టన్ టెస్టులో న్యూజిలాండ్ పైచేయి
  • ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయడంపై దృష్టి పెట్టాలన్న అశ్విన్
  • రహానే, విహారి అలాగే ఆడాలని సూచన
వెల్లింగ్టన్ టెస్టులో న్యూజిలాండ్ టెయిలెండర్లను అవుట్ చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. చివరి మూడు వికెట్లకు 125 పరుగులు జోడించిన కివీస్ కు ఆ పరుగులే ఇప్పుడు మ్యాచ్ పై ఆధిక్యాన్ని అందించాయి. దీనిపై టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. కివీస్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ బాగా ఆడారని, ఫాస్ట్ బౌలర్ కైల్ జేమీసన్ కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సెంచరీలు సాధించిన అనుభవం ఉందని తెలిపాడు. కివీస్ ఆటగాళ్లు పరిస్థితులకు అనుగుణంగా ఆడారని కితాబిచ్చాడు. అయితే తాము ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నాడు.

ఇక, మ్యాచ్ తీరుతెన్నుల గురించి మాట్లాడుతూ, అసలైన టెస్టు ఇప్పుడే మొదలైందన్నాడు. రేపటి తొలి సెషన్ లో తాము వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడితే మ్యాచ్ లో తమకూ అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డాడు. పిచ్ తొలిరోజు మాదిరిగా లేదని, రహానే, విహారి అదే ఆటతీరు కొనసాగించాలని సూచించాడు. పిచ్ ఎలా స్పందిస్తుందన్నది వారికి బాగా అర్థమైందని పేర్కొన్నాడు.


More Telugu News