ఎవరూ భయపడొద్దు.. పూర్తి స్థాయిలో బలగాలను రంగంలోకి దించాం: అజిత్ ధోవల్
- ఢిల్లీ పోలీసుల సమర్థతను చాలా మంది సందేహిస్తున్నారు
- యూనిఫాం ధరించినవారిని విశ్వసించాలి
- ఎవరూ భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు
ఢిల్లీలో చోటు చేసుకున్న అల్లర్లలో మృతుల సంఖ్య 20కి పెరిగింది. 150 మందికి పైగా గాయపడినవారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ మాట్లాడుతూ, ఎవరూ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు. భారీ స్థాయిలో భద్రతాబలగాలను మోహరింపజేశామని తెలిపారు.
ఢిల్లీ పోలీసుల సమర్థతపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని... దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ధోవల్ చెప్పారు. యూనిఫాం ధరించిన సిబ్బందిని విశ్వసించాలని అన్నారు. ప్రజలు కొంతమేర అభద్రతా భావానికి గురవుతున్నారని... ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఏ వర్గానికి చెందిన వారు కూడా భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపారు. మైనార్టీ వర్గాలకు కూడా అందుబాటులో ఉంటామని చెప్పారు.