'కరోనా' కలకలం.. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చేరిన ఎనిమిది మంది అనుమానితులు

  • తెలంగాణ ప్రజలకు కరోనా వైరస్‌ 'కోవిడ్‌-19' భయం
  • ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా 
  • ఇటీవల విదేశాల నుంచి వచ్చిన ఎనిమిది మంది
  • కరోనా లక్షణాలతో ఆసుపత్రికి
తెలంగాణ ప్రజలకు కరోనా వైరస్‌ 'కోవిడ్‌-19' భయం పట్టుకుంది. తెలంగాణకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా సోకిందని ఇప్పటికే తేలిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కరోనా సోకిన వ్యక్తిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తుండగా, మరోవైపు ఎనిమిది మంది కరోనా అనుమానితులు గాంధీ ఆసుపత్రిలో చేరారు.

ఇటీవల వారంతా ఇటలీ, ఇండొనేషియా, ఇజ్రాయెల్, జపాన్‌ నుంచి వచ్చారు. కరోనా లక్షణాలు కనపడడంతో ఆసుపత్రిలో చేరారు. కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వైరస్ బారిన పడి దాదాపు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు.


More Telugu News