సాంకేతిక సమస్యలతో.. షాద్‌నగర్‌లో నిలిచిపోయిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
- నానా పాట్లు పడుతున్న ప్రయాణికులు
- ఉదయం ఆరు గంటలకు కాచిగూడ రావాలి
- పన్నెండున్నర దాటుతున్నా ఇంకా అక్కడే
సాంకేతిక లోపం కారణంగా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ షాద్‌నగర్‌లో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పాట్లు వర్ణనాతీతం. చిత్తూరు నుంచి కాచిగూడకు వెళ్లాల్సిన రైలును అధికారులు షాద్‌నగర్‌లో నిలిపివేశారు. దీంతో ఉదయం 6 గంటలకు కాచిగూడ చేరాల్సిన రైలు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలు దాటినా ఇంకా అక్కడే ఉంది. సాంకేతిక సమస్య పరిష్కారానికి రైల్వే సిబ్బంది ప్రయత్నిస్తున్నారని, సమస్య పరిష్కారం కాగానే రైలు బయలుదేరుతుందని అధికారులు చెప్పి చేతులు దులిపేసుకున్నారు.