సీఎం జగన్​ కు ధన్యవాదాలు తెలిపిన పరిమళ్​ నత్వానీ

  • వైసీపీ నుంచి రాజ్యసభ సీటు పొందిన పరిమళ్ నత్వాని
  • జగన్ కు, వైసీపీకి ధన్యవాదాలు
  • ఏపీ అభివృద్ధికి పాటుపడతా.. ట్విట్టర్ వేదికగా నత్వానీ స్పందన
ఏపీ నుంచి తమ పార్టీ తరఫున నలుగురు రాజ్యసభ అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఆ నలుగురిలో పరిమళ్ నత్వానీ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కు, వైసీపీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏపీ రాష్ట్రాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నానంటూ ఓ పోస్ట్ చేశారు.

కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యాపారవేత్త పరిమళ్ నత్వానీ. ‘రిలయన్స్’లో నత్వానీ కీలక వ్యక్తి. బీజేపీ నేతలతో కీలక సంబంధాలు ఉన్న నత్వానీ, ఇప్పటికే రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.


More Telugu News