కరోనాపై తెలంగాణ చర్యలను కేంద్రం కూడా ప్రశంసించింది: ఈటల
- అధికారులతో సమావేశం నిర్వహించిన ఈటల
- ఇప్పటివరకు తెలంగాణలో 18 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వెల్లడి
- వారందరూ విదేశాల నుంచి వచ్చినవారేనని వివరణ
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఐఎంఏ తదితర వైద్యసంఘాల ప్రతినిధులతో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్ కోఠిలోని కమాండ్ కంట్రోల్ రూంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ, కరోనాపై తెలంగాణ తీసుకుంటున్న చర్యలను కేంద్రం కూడా అభినందించిందని తెలిపారు. రాష్ట్రంలోని వారికి ఎవరికీ కరోనా లేదని, విదేశాల నుంచి వచ్చినవాళ్లే కరోనా బాధితులయ్యారని వెల్లడించారు.
ఇప్పటివరకు 18 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని అన్నారు. అత్యవసర పరిస్థితులలో, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయితే, ప్రజల సన్నద్ధత లేకపోతే ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా నిష్ప్రయోజనమేనని మంత్రి అన్నారు.