కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన రాహుల్ గాంధీ

  • పేదల కోసం గరీబ్ కల్యాణ్ ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం
  • రూ.1.70 లక్షల కోట్లతో భారీ ప్యాకేజీ
  • సరైన దిశలో తీసుకున్న తొలి అడుగని రాహుల్ ప్రశంస
కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించడం వల్ల పేద, బలహీన తరగతి ప్రజలు ఇబ్బందుల పాలుకాకుండా  ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఏకంగా 1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. గరీబ్ కల్యాణ్ పేరుతో కేంద్రం భారీ ప్యాకేజీని అనౌన్స్ చేసింది. పేదలు, రోజువారీ కూలీల కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం  ప్రకటించిన ప్యాకేజీ సరైన నిర్ణయమని ఆయన అన్నారు. సరైన దిశలో తీసుకున్న తొలి అడుగని ప్రశంసించారు. లాక్ డౌన్ ను భరిస్తున్న రైతులు, కూలీలు, రైతు కూలీలు, మహిళలు, వృద్ధులకు దేశం రుణపడి ఉంటుందని చెప్పారు.


More Telugu News