కరోనా వైరస్ వ్యాప్తిపై తాజా బులెటిన్ విడుదల చేసిన కేంద్రం
- దేశవ్యాప్తంగా 873 పాజిటివ్ కేసులు
- ఇప్పటివరకు 22 మంది మరణం
- 79 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 873 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు బులెటిన్ లో వెల్లడించారు. ఇప్పటివరకు 22 మంది మరణించగా, 79 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనాపై రాష్ట్రాలతో కలిసి పోరాడుతున్నామని, దేశవ్యాప్తంగా నోడల్ అధికారులను నియమించామని వెల్లడించారు.
శాంపిల్స్ సేకరణ వేగంగా సాగుతోందని, వలస కార్మికులను ఆదుకోవడానికి కేంద్రం చర్యలు చేపట్టిందని వివరించారు. దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి మూడు నెలలు ఉచిత చికిత్స అందించనున్నామని తెలిపారు. కరోనాపై మరికొంతమంది డాక్టర్లకు శిక్షణ ఇస్తున్నామని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నామని, నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అన్నారు.
అటు, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 65కి చేరగా, ఏపీలో 16కి పెరిగింది. తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 9 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఒక మరణం కూడా సంభవించింది. ఏపీలో తాజాగా కర్నూలు జిల్లాలో ఒకటి, ప్రకాశం జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి.