లాక్ డౌన్ కాలానికి ప్రత్యేక యోగాసనాన్ని సూచించిన మోదీ!
- లాక్ డౌన్ కాలంలో యోగా చేయాలంటూ ప్రజలకు సూచన
- యోగనిద్ర ఆసనంతో ఒత్తిడి దూరమవుతుందని వెల్లడి
- యోగా తనకెంతో ఉపయోగపడిందని వివరణ
దేశంలో కరోనా వ్యాప్తి నివారణ కోసం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ కాలంలో ప్రజలు ఇంటి వద్దే ఉంటూ ఫిట్ గా ఎలా ఉండాలో ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తాను తరచుగా పాటించే ఓ యోగాసనం తాలూకు వీడియోను కూడా ట్విట్టర్ లో పంచుకున్నారు. "నాకెప్పుడు సమయం దొరికినా వారానికి రెండు మూడు సార్లు ఈ యోగాసనాన్ని ప్రాక్టీసు చేస్తుంటాను. దీన్ని యోగనిద్ర ఆసనం అంటారు. ఇది ఒత్తిడిని తొలగిస్తుంది. తద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాదు, మనసును స్థిమితంగా ఉంచుతుంది. ఒత్తిడి, ఉద్విగ్నతలను తగ్గిస్తుంది" అని మోదీ వివరించారు.
అయితే, ఓ విషయం గమనించాలని, తానేమీ యోగా నిపుణుడ్ని కాదని, యోగా టీచర్ ను కూడా కాదని, కేవలం యోగా అభ్యాసకుడ్ని మాత్రమేనని వివరించారు. తాను పాటించే ఆసనం గురించి ప్రజలతో పంచుకుంటున్నానని స్పష్టం చేశారు. అనేక యోగాసనాలు తనకెంతో ఉపయోగపడ్డాయని, ఈ లాక్ డౌన్ కాలంలో ఇలాంటి యోగా చిట్కాలు ప్రజలకు కూడా ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో చెబుతున్నానని వెల్లడించారు.