న్యూఢిల్లీ నుంచి మర్కజ్ కు వచ్చి కరోనాతో మరణించిన దక్షిణాఫ్రికా వాసి!
- విజిటింగ్ వీసాపై భారత్ కు వచ్చిన వృద్ధుడు
- తిరుగు ప్రయాణంలో కరోనా లక్షణాలు
- చికిత్స పొందుతూ కన్నుమూసిన యూసఫ్ టుట్లా
గత నెలలో న్యూఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలో నిర్వహించిన మర్కజ్ మత ప్రార్థనల నిమిత్తం దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ వృద్ధుడు, కరోనా సోకి మరణించాడు. దక్షిణాఫ్రికాకు చెందిన మౌలానా యూసఫ్ టుట్లా (80) ఇటీవల విజిటింగ్ వీసాపై భారత్ కు వచ్చి, ఢిల్లీలో జరిగిన మర్కజ్ కు హాజరయ్యారు.
ప్రార్థనలు ముగిసిన అనంతరం, స్వదేశానికి తిరిగి బయలుదేరిన వేళ, వైద్యులు ఆయనకు చేసిన ప్రాథమిక పరీక్షల్లో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఆయన్ను ఐసొలేషన్ వార్డుకు తరలించిన అధికారులు, రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ వచ్చింది. అతనికి చికిత్సను అందిస్తుండగా, అప్పటికే పలు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న టుట్లా, చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా, ఇండియాలో కరోనా వైరస్ ఇంతలా వ్యాపించడానికి మర్కజ్ ప్రార్థనలే కారణమయ్యాయన్న సంగతి తెలిసిందే. ఇండియాలో కరోనా సోకిన వారిలో 80 శాతం మంది మర్కజ్ తో సంబంధమున్నవారే కావడం గమనార్హం.