మసీదులో దాక్కున్న ఇథియోఫియా వాసులు.. గుర్తించి బయటకు రప్పించిన పోలీసులు
- చెన్నై నగరంలో ఘటన
- ఉలిక్కిపడిన స్థానికులు
- వీరంతా ఢిల్లీలోని జబ్లీగీ జమాత్‌కు వెళ్లి వచ్చిన వారు
తమకు సమీపంలోని ఓ మసీదులో ఎనిమిది మంది ఇథియోఫియన్లు కొన్నాళ్లుగా తలదాచుకున్నారన్న విషయం వెలుగు చూడడంతో తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైవాసులు ఉలిక్కిపడ్డారు. వీరంతా మార్చిలో ఢిల్లీలో జరిగిన జబ్లిగీ జమాత్‌కు వెళ్లి వచ్చిన వారు అని తెలియడంతో మరింత ఆందోళన చెందారు.
నిజాముద్దీన్‌లో జరిగిన జమాత్‌కు హాజరై వచ్చిన వారు పలువురు కరోనా బారిన పడడం, వారి నుంచి ఇతరులకు విస్తరించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా దేశవ్యాప్తం కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం జమాత్‌కు వెళ్లి వచ్చిన వారిని, వారితో కలిసిన వారిని గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలించింది. అయినా కొంతమంది స్థానికుల సాయంతో దాక్కుని ఉన్నారన్న విషయం చెన్నై ఘటనతో వెలుగు చూసింది. దీంతో పోలీసులు ఈ విదేశీయులను బయటకు రప్పించారు. వీసా నిబంధనలు ఉల్లంఘించి మత ప్రచారంలో పాల్గొన్న నేరంపై కేసులు పెట్టారు. ప్రస్తుతం వీరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారి ఆరోగ్యంపై వచ్చి నివేదిక మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటారు.