నాడు ద్వేషించా, నేడు అభిమానిస్తున్నానన్న నెటిజన్ ట్వీట్ పై కేటీఆర్ స్పందన!
- నేను తెలంగాణ వాసిని కాదంటూ సుధీర్ ట్వీట్
- తమ మనసులో ద్వేషం స్థానంలో అభిమానం నెలకొందని వ్యాఖ్య
- ఎంతో ఆనందం కలిగిందన్న కేటీఆర్
గతంలో తాను సీఎం కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ లను ఎంతగానో ద్వేషించానని, ఇప్పుడు తాను వారి ఫ్యాన్ ను అయ్యానని సుధీర్ అనే నెటిజన్ చేసిన ట్వీట్ పై కేటీఆర్ స్పందించారు.
"నేను తెలంగాణ వాసిని కాను. తొలుత మిమ్మల్ని, మీ తండ్రినీ ద్వేషించిన వారిలో నేనూ ఒకడిని. కానీ, గత ఐదేళ్ల మీ పాలనా విధానాన్ని చూసి మీకు అభిమానిని అయ్యాను. ఒక్క తెలంగాణే కాదు... దేశం మొత్తం మీ నాయకత్వాన్ని పొందుతుందని కోరుకుంటున్నాను" అని సుధీర్ ట్వీట్ చేశాడు.
ఇది కేటీఆర్ దృష్టికి వెళ్లింది. దీనికి రిప్లయ్ ఇస్తూ, "మీలో వచ్చిన మార్పునకు అభినందనలు. మీ హృదయంలో ద్వేషం స్థానంలో అభిమానం చోటు చేసుకోవడం ఎంతో ఆనందదాయకం" అని అన్నారు. కేటీఆర్, సుధీర్ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.