దేశంలో అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్న కరోనా కేసులు.. 20 వేలు దాటేసిన వైనం!
- నేడు కొత్తగా 1486 కొత్త కేసులు
- 20,471కి పెరిగిన కేసుల సంఖ్య
- కేసులు, మరణాల్లో ముందున్న మహారాష్ట్ర
దేశంలో కరోనా కేసులు అడ్డుఅదుపు లేకుండా పెరుగుతూ పోతున్నాయి. నేటి సాయంత్రానికి దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 20 వేలు దాటేసింది. గత 24 గంటల్లో 1,486 కేసులు నమోదు కావడంతో మొత్తంగా వీటి సంఖ్య 20,471కి పెరిగింది. కొత్తగా 49 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా మరణాలతో కలుపుకుని మొత్తం మరణాల సంఖ్య 652కు పెరిగింది. అలాగే, ఇప్పటి వరకు 3,959 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక, దేశంలో అత్యధిక కేసులు, మరణాలతో మహారాష్ట్ర ముందుంది. అక్కడ ఇప్పటి వరకు 5,221 కేసులు నమోదు కాగా, 251 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,272 కేసులు, 95 మరణాలతో గుజరాత్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఢిల్లీలో 2,156, రాజస్థాన్లో 1,801 , తమిళనాడులో 1,596, మధ్యప్రదేశ్లో 1,592, ఉత్తరప్రదేశ్లో 1,412 కేసులు నమోదయ్యాయి.