పవన్ కల్యాణ్ సరసన నివేదా పేతురాజ్

  • భారీ సినిమాతో బిజీగా క్రిష్
  • మొఘల్ చక్రవర్తుల కాలం నాటి నేపథ్యం 
  • కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే కథ
పవన్ కల్యాణ్ తాజా చిత్రంగా 'వకీల్ సాబ్' రూపొందుతోంది. ఈ సినిమా తరువాత ఆయన క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్లానింగ్ జరుగుతోంది. మొఘలాయిల కాలం నాటి కథతో ఈ సినిమా నిర్మితం కానుంది. 'కోహినూర్' వజ్రం చుట్టూ ఈ కథ తిరగనుంది. ఆ వజ్రాన్ని చేజిక్కించుకునే దొంగగా పవన్ కల్యాణ్ కనిపించనున్నాడు.

ఈ సినిమాలో కథానాయిక పాత్రకిగాను జాక్విలిన్ .. కీర్తి సురేశ్ పేర్లు వినిపించాయి. తాజాగా నివేదా పేతురాజ్ పేరు తెరపైకి వచ్చింది. కథానాయికగా ఆమె ఎంపిక ఖరారైపోయిందనే అంటున్నారు. నివేదా పేతురాజ్ మంచి పొడగరి .. అందువలన పవన్ సరసన ఆమె జోడీ బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా నివేదా పేతురాజ్ కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందని అంటున్నారు.


More Telugu News