కిమ్ చనిపోయి ఉండొచ్చు లేక అచేతన స్థితిలో ఉండొచ్చు: ట్రంప్ సలహాదారు

  • ఉత్తర కొరియా అధినేత ఉనికిపై ఊహాగానాలు
  • పరిస్థితి విషమం అంటూ కథనాలు
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన లిండ్సే గ్రాహమ్
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఉనికిపై ఇప్పటికీ సందేహాలు తొలగిపోలేదు. కిమ్ పరిస్థితి విషమించిందని, గుండె ఆపరేషన్ వికటించిందని పలు కథనాలు వచ్చాయి. అటు, సీఎన్ ఎన్ లో కిమ్ ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన కథనాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ట్రంప్ విదేశాంగ సలహాదారు లిండ్సే గ్రాహమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కిమ్ చనిపోయి ఉండొచ్చని, లేకపోతే ఆయన అచేతన స్థితిలో ఉండి ఉండొచ్చని అన్నారు. కిమ్ ప్రస్తుత పరిస్థితిపై ఉత్తర కొరియా వర్గాలు పెదవి విప్పకపోవడంతో ఊహాగానాలు నిజమనేందుకు బలం చేకూరుతోందని తెలిపారు.

"ఉత్తర కొరియా అంటే బయటి ప్రపంచానికి అనుమతి లేని ఓ సమాజం. కిమ్ పరిస్థితికి సంబంధించి ఇప్పటివరకు నాకు నేరుగా ఏ విషయం తెలియరాలేదు. జరుగుతున్న పరిణామాలను చూస్తూ... కిమ్ చనిపోలేదని, అచేతన స్థితిలో లేడని ఎవరైనా చెబితే నేను నమ్మను. లేకపోతే ఇలాంటి పుకార్లను ఇన్నిరోజుల పాటు ఖండించకుండా ఎలా ఉంటారు? ఒకవేళ కిమ్ నిజంగానే చనిపోయి ఉంటే ఇన్నాళ్లు బాధలు పడిన ఉత్తర కొరియా ప్రజలు ఎంతో ఊరట పొందుతారు" అని వ్యాఖ్యానించారు.


More Telugu News