నేటి నుంచి వలస కార్మికులకు అందుబాటులోకి వచ్చిన రైళ్లు: మంత్రి తలసాని

  • తలసానికి కిషన్‌రెడ్డి ఫోన్‌
  • రైలు సేవలపై కేంద్రం కీలక నిర్ణయం
  • తెలంగాణ నుంచి ఝార్ఖండ్‌కు బయలుదేరిన తొలి రైలు
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫోన్‌ చేసి పలు కీలక విషయాలు తెలిపారు. దీనిపై తలసాని మీడియాతో మాట్లాడుతూ... నేటి నుంచి వలస కార్మికుల కోసం రైళ్లు అందుబాటులో ఉంటాయని కిషన్‌రెడ్డి తెలిపారని అన్నారు. ‌ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారని చెప్పారు. రైళ్లలో ఆయా రాష్ట్రాల కూలీలను తరలిస్తామని కిషన్ రెడ్డి తెలిపారన్నారు.

కాగా, లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటే సరికాదని, వలస కూలీలను రైళ్లలో తరలించాలని నిన్న తలసాని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. రైళ్లు ఏర్పాటు చేయాలంటూ తలసాని చేసిన సూచన బాగుందని కిషన్ రెడ్డి అన్నారు. కాగా, లాక్‌డౌన్‌ విధించిన అనంతరం తొలిసారి ప్రయాణికుల కోసం రైలు కదిలింది. ఈ రోజు ఉదయం తెలంగాణ నుంచి ఝార్ఖండ్‌కు వలస కూలీలతో ఓ రైలు బయలు దేరింది. లింగంపల్లి  రైల్వే స్టేషన్‌ నుంచి దాదాపు 1,200 మంది కూలీలు ఝార్ఖండ్‌లోని హతియా జిల్లాకు బయలుదేరారు.


More Telugu News