సరికొత్త ఉదయాన్ని చూసిన ఇటలీ ప్రజలు.. నిన్న 44 లక్షల మంది రోడ్లపైకి!

  • యూరప్‌లోని చాలా దేశాల్లో లాక్‌డౌన్ సడలింపులు
  • ఇటలీలో ప్రారంభమైన ఆర్థిక కార్యకలాపాలు
  • పాకిస్థాన్‌లో లాక్‌డౌన్ ఎత్తివేసే యోచనలో ఇమ్రాన్
ఇటలీ  ప్రజలు నిన్న ఆనంద పరవశంలో మునిగితేలారు. దాదాపు రెండు నెలలపాటు ఇళ్లల్లో మగ్గిన ఇటలీవాసులు సోమవారం సరికొత్త ఉదయాన్ని చూశారు. లాక్‌డౌన్ ఆంక్షలను ప్రభుత్వం పాక్షికంగా సడలించడంతో వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. 44 లక్షల మంది పనుల కోసం బయటకు వచ్చారు. నిర్మాణ, ఉత్పత్తి రంగాల్లో కొత్త కళ కనిపించింది. రోడ్లపైకి వచ్చిన జనంలో ముఖాల్లో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపించింది.

మరోవైపు, ఐరోపా దేశాల్లో చాలా వరకు తిరిగి కార్యకలాపాలు మొదలయ్యాయి. వైరస్ ఇంకా పూర్తిగా అదుపులోకి రానప్పటికీ ప్రభుత్వాలు కొన్ని సడలింపులు ఇవ్వడంతో చాలా రంగాల్లో పనులు మొదలయ్యాయి. మలేసియాలోనూ లాక్‌డౌన్ ఆంక్షలు సడలించగా, పాకిస్థాన్‌లో లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ యోచిస్తున్నారు.


More Telugu News