విజయ్ మాల్యాకు చుక్కెదురు... ఇక భారత్ కు అప్పగింతే తరువాయి!
- గత నెలలో మాల్యా పిటిషన్ కొట్టివేత
- సుప్రీంను ఆశ్రయించేందుకు అనుమతించాలంటూ దరఖాస్తు
- ఆ దరఖాస్తును కూడా కొట్టివేసిన యూకే హైకోర్టు
ఒకప్పుడు లిక్కర్ వ్యాపారాన్ని శాసించి, కింగ్ ఫిషర్ బ్రాండుతో అనేక వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించిన విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. తనను భారత్ కు అప్పగించవద్దని కోరుతున్న మాల్యా యూకే హైకోర్టును ఆశ్రయించగా, ఏప్రిల్ 20న ఆ పిటిషన్ కొట్టివేతకు గురైంది.
దాంతో, తాను సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ న్యాయస్థానానికి దరఖాస్తు చేసుకోగా, తాజాగా ఆ దరఖాస్తును కూడా న్యాయస్థానం తిరస్కరించింది. దాంతో విజయ్ మాల్యాకు న్యాయపరమైన అవకాశాలన్నీ ముగిసినట్టయింది. ఈ నేపథ్యంలో, కోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిపై బ్రిటన్ హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ అధికారిక ముద్రవేయడమే తరువాయిగా కనిపిస్తోంది. ఈ మొత్తం ప్రక్రియ 28 రోజుల్లో పూర్తికానుండగా మాల్యా భారత్ కు రాకతప్పదని తెలుస్తోంది.