మరో రెండు రోజుల్లో కర్ణాటకలో తెరుచుకోనున్న జిమ్‌లు, గోల్ఫ్‌క్లబ్‌లు
- ఈ నెల 17తో ముగియనున్న లాక్‌డౌన్
- హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు సీఎం సానుకూలం
- కొత్త మార్గదర్శకాలు వచ్చిన వెంటనే తెరుస్తామన్న మంత్రి
కర్ణాటకలో మరో రెండు రోజుల్లో జిమ్‌లు, గోల్ఫ్‌క్లబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు తెరుచుకోనున్నాయి. మూడో దశ లాక్‌డౌన్ ముగిసిన వెంటనే వీటిని ప్రారంభించేందుకు సమాయత్తం అవుతున్నట్టు ఆ రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి సీటీ రవి తెలిపారు. వీటిని తెరిచే విషయమై ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో చర్చించినట్టు తెలిపారు.
రెస్టారెంట్లు, హోటళ్లు పునఃప్రారంభం విషయంలో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ నెల 17న లాక్‌డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో కేంద్రం నుంచి కొత్త మార్గదర్శకాలు విడుదలైన వెంటనే రాష్ట్రంలో జిమ్‌లు, గోల్ఫ్ క్లబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లను తెరిచేందుకు అనుమతి ఇస్తామని మంత్రి వివరించారు.