గాలిలోకి కాలుష్య ఉద్గారాలు.. జెన్‌కోకు రూ. 3.50 కోట్ల జరిమానా

  • ప్లాంట్ల నిర్మాణానికి 2022 వరకు గడువు కోరిన జెన్‌కో
  • కుదరదన్న కేంద్ర పర్యావరణ శాఖ
  • ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం
తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పొరేషన్ (టీఎస్‌జెన్‌కో)కు కేంద్ర పర్యావరణ శాఖ షాకిచ్చింది. కాలుష్య ఉద్గారాలను గాలిలోకి యథేచ్ఛగా వదిలేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పర్యావరణశాఖ దాదాపు రూ.3.50 కోట్ల జరిమానా విధించింది.

పాల్వంచలోని కేటీపీఎస్‌లో ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్‌జీడీ) ప్లాంట్ల నిర్మాణం చేపట్టకపోవడంపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన పర్యావరణ శాఖ.. ఆదేశాలను ఉల్లంఘించి ఉద్గారాలను గాల్లోకి వదిలి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారంటూ ఈ జరిమానా విధించింది. కాగా, ప్లాంట్ల నిర్మాణానికి 2022 వరకు గడువు ఇవ్వాలన్న జెన్‌కో అభ్యర్థనను తిరస్కరించిన కేంద్ర పర్యావరణ శాఖ  గత నెలలో నోటీసులు జారీ చేసింది.


More Telugu News