క్వారంటైన్ లో ఉన్న అమ్మాయిల ఆరోగ్యాన్ని పరిశీలించాలంటూ... ఉద్యోగి అసభ్య ప్రవర్తన!

  • ఉత్తర త్రిపురలో ఘటన
  • మెడికల్ సిబ్బందిగా చెప్పుకున్న పంచాయితీ రాజ్ ఉద్యోగి
  • బాలికల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
హోమ్ క్వారంటైన్ లో ఉన్న ఇద్దరు అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ పంచాయితీ రాజ్ ఉద్యోగి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే, నార్త్ త్రిపురలోని ఉనాకోటి సమీపంలోని కుమార్ ఘాట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ముందు జాగ్రత్తగా ఇద్దరు బాలికలను అధికారులు హోమ్ క్వారంటైన్ లో ఉంచారు.

ఇదే ప్రాంతానికి చెందిన పంచాయితీ రాజ్ ఉద్యోగి రిజబ్ కాంతిదేబ్, తనను తాను పారా మెడికల్ సిబ్బందిగా పరిచయం చేసుకుని వెళ్లి, వారి ఆరోగ్యాన్ని పరిశీలించాలంటూ చెప్పి, అసభ్యంగా ప్రవర్తించాడు. వారిద్దరి ఫోన్ నంబర్లనూ తీసుకుని, వారికి తరచూ ఫోన్ చేసి వేధింపులకు గురి చేశాడు. దీంతో విసిగిపోయిన బాలికలు, విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఈ విషయం తెలుసుకున్న రిజబ్, ప్రస్తుతం పరారీలో ఉండగా, పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. మరోవైపు రిజబ్ పై శాఖాపరమైన విచారణ కూడా ప్రారంభించామని బ్లాక్ డెవలప్ మెంట్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.


More Telugu News