‘రౌడీబేబీ’పై కేసు నమోదు.. ఆత్మహత్యాయత్నం చేసిన టిక్‌టాక్ స్టార్
- ఇటీవలే సింగపూర్ వెళ్లొచ్చిన సుబ్బులక్ష్మి
- విలేకరిని అసభ్యపదజాలంతో దూషించడంతో కేసు నమోదు
- ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం
తమిళనాడు టిక్‌టాక్ స్టార్, రౌడీబేబీ సూర్యగా సోషల్ మీడియాలో చిరపరిచితురాలైన సుబ్బులక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసింది. సింగపూర్ వెళ్లి లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలపాటు అక్కడే చిక్కుకుపోయిన సుబ్బులక్ష్మి ఇటీవల ఇండియా తిరిగొచ్చింది. విమానాశ్రయంలో కరోనా పరీక్షల నుంచి తప్పించుకుని తిరువూరులోని ఇంటికి చేరుకున్న ఆమెను క్వారంటైన్‌కు తరలించేందుకు అధికారులు, పోలీసులు పడరాని పాట్లు పడ్డారు. ఆసుపత్రిలో తనకు ప్రత్యేకంగా ఏసీ గది కావాలని, ప్రభుత్వాసుపత్రిలో సాధారణ ప్రజల మధ్య తాను ఉండలేనని నానా యాగీ చేసింది.
అంతేకాదు, ఓ విలేకరిని అసభ్య పదజాలంతో తిట్టిపోసింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదు కావడంతో మనస్తాపం చెందిన ‘రౌడీబేబీ’ నిన్న ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.