నేడు రష్యా, భారత్, చైనా త్రైపాక్షిక కూటమి కీలక భేటీ.. ఉద్రిక్తతలపై చర్చలు
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మధ్యాహ్నం 1.30 గంటలకు భేటీ
- ప్రపంచంలో తాజా పరిణామాలపై చర్చ
- కరోనా, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, సామాజిక అంశాలపై భేటీ
- పాల్గొననున్న విదేశాంగ మంత్రులు
ఈ రోజు రష్యా, భారత్, చైనా త్రైపాక్షిక కూటమి సమావేశం నిర్వహించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ కూటమి భేటీ కానుంది. ప్రపంచంలో తాజా పరిణామాలపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కరోనా, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, సామాజిక అంశాలపై ఈ మూడు దేశాల విదేశాంగ మంత్రులు చర్చలు జరపనున్నారు. భారత్, చైనా మధ్య ప్రస్తుతం నెలకొన్న ఘర్షణ వాతావరణంపై కూడా వారు చర్చించనున్నారు.
కాగా, ఇదే సమయంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలపై సోవియట్ యూనియన్ విజయం సాధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించనున్న కవాతుకు ఆయన హాజరవుతున్నారు. ఈ సందర్భంగా రష్యాతో చైనా అంశంపై కూడా ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది.