చైనా దాడికి వ్యతిరేకంగా నిలబడతాం.. కానీ, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి: రాహుల్ గాంధీ

  • గాల్వన్‌ లోయ వద్ద నెలకొన్న ఉద్రిక్తతలపై రాహుల్ ట్వీట్
  • మరోసారి అనుమానాలు వ్యక్తం చేసిన రాహుల్
  • భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా? అని ప్రశ్న
గాల్వన్‌ లోయ వద్ద నెలకొన్న ఉద్రిక్తతలపై కేంద్ర ప్రభుత్వం పలు అంశాలు దాస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ కొన్ని రోజులుగా అనుమానాలు వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.  'చైనా దాడికి వ్యతిరేకంగా అందరం ఏకమై  నిలబడతాం. అయితే, భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా?' అని ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేశారు.

కాగా, భారత భూభాగంలోకి చైనా సైనికులు చొచ్చుకుని రాలేదంటూ ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ నిన్న కూడా స్పందిస్తూ... 'ఘర్షణ నెలకొన్న సమయంలో ప్రధాని మోదీపై చైనా ఎందుకు ప్రశంసలు కురిపిస్తోంది?' అని రాహుల్ ప్రశ్నించారు. గాల్వన్‌లో ఇరు దేశాల మధ్య ఘర్షణలు నెలకొంటున్న వేళ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలంటూ రాహుల్ కొన్ని రోజులుగా నిలదీస్తోన్న విషయం తెలిసిందే.


More Telugu News