ఎస్వీబీసీ చానల్‌లో ఇక ప్రకటనలు ఉండవు: టీటీడీ
- విసుగు తెప్పిస్తున్న ప్రకటనలపై భక్తుల ఆగ్రహం
- దిగొచ్చిన టీటీడీ
- యాడ్‌ఫ్రీ చానల్‌గా మార్పు
తమకు ఆదాయం కంటే భక్తుల మనోభావాలే ముఖ్యమని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ)లో ప్రకటనలు విసుగు తెప్పించేలా ఉండడంతో భక్తుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో చానల్‌ను ఇకపై యాడ్‌ఫ్రీగా మార్చాలని నిర్ణయించినట్టు టీటీడీ తెలిపింది. తమకు ఆదాయ వనరుల కంటే భక్తుల మనోభావాలే ముఖ్యమని ఈ సందర్భంగా పేర్కొంది. అంతేకాదు, చానల్ నిర్వహణకు భక్తులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తే స్వీకరిస్తామని పేర్కొంది. కాగా, చానల్ నిర్వహణ కోసం భక్తుల నుంచి ఇప్పటికే రూ. 25 లక్షల విరాళాలు అందినట్టు తెలిపింది.