గూగుల్ సెర్చ్‌లోనూ ‘టాప్’ లేపుతున్న కరోనా!
- మే నెలతో పోలిస్తే 66 శాతం తగ్గిన కరోనా సెర్చ్
- ఫిబ్రవరితో పోలిస్తే మాత్రం రెట్టింపు
- వెల్లడించిన గూగుల్ ట్రెండ్స్
ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్న కరోనా మహమ్మారి గూగుల్ సెర్చ్‌లోనూ దూసుకుపోతోంది. గత నెలలో నెటిజన్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికింది దీని కోసమే. మే నెలతో పోలిస్తే జూన్‌లో కరోనా సెర్చ్ 66 శాతం తగ్గినప్పటికీ ఫిబ్రవరిలో కంటే మాత్రం వెతుకులాట రెట్టింపు అయిందని గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ వెల్లడించింది. కరోనా మహమ్మారి మెడను న్యూజిలాండ్ ఎలా వంచింది? అసలు ఈ వైరస్‌కు ముగింపు ఉందా? ఏ మాస్క్ ధరిస్తే మహమ్మారి బారినపడకుండా ఉంటాం? వైరస్ లక్షణాలు ఎన్ని రోజులు ఉంటాయి? దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్ని లక్షల మంది మరణించారు? వంటి వాటి గురించి గూగుల్‌లో వెతికినట్టు గూగుల్ ట్రెండ్స్ పేర్కొంది.