24 గంటల్లో దేశంలో 20,903 మందికి కొత్తగా కరోనా
- కేసుల సంఖ్య మొత్తం 6,25,544
- మృతుల సంఖ్య 18,213
- 2,27,439 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
- కోలుకున్న వారు 3,79,892 మంది
దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 20,903 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 379 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 6,25,544కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 18,213కి పెరిగింది. 2,27,439 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,79,892 మంది కోలుకున్నారు.
కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 92,97,749 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,41,576 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.