బోయపాటి సినిమాలో కథానాయికగా అమలాపాల్?
- బాలయ్య, బోయపాటి కలయికలో మూడో సినిమా
- అమలాపాల్ తో ప్రస్తుతం సంప్రదింపులు
- గత నెలలో వచ్చిన టీజర్ కు మంచి రెస్పాన్స్
'సింహా', 'లెజండ్' హిట్స్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కలయికలో ప్రస్తుతం మూడో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బోయపాటి స్టయిల్ లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు అమలా పాల్ ఎంపిక అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ పాత్రకు రాశిఖన్నా, కేథరిన్ వంటి పేర్లు నిన్నటి వరకు వినిపించినా వారెవరూ ఫైనల్ కాలేదు. ఈ క్రమంలో తాజాగా అమల పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం చిత్రం యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.
కాగా, లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రానికి సంబంధించిన కొంత షూటింగ్ జరిగింది. ఇప్పుడు మళ్లీ షూటింగును ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, హీరో బాలకృష్ణ మాత్రం మరికొన్నాళ్లు పోయాకనే ఈ షూటింగులో జాయిన్ అవుతారని తెలుస్తోంది. గత నెలలో విడుదలైన ఈ చిత్రం టీజర్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తమన్ సంగీతం దీనికి ఓ హైలైట్ గా చెప్పుకోవచ్చు.