అలాంటి పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి: గల్లా జయదేవ్
- పోలీసులు స్వేచ్ఛగా పని చేయడం లేదు
- ప్రజల ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు మర్చిపోయారు
- కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా పోలీసులు మారడం లేదు
ఏపీ పోలీసుల పనితీరును టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తప్పుపట్టారు. స్వేచ్ఛగా పని చేసే స్వభావాన్ని, సొంతంగా ఆలోచించే శక్తిని పోలీసులు కోల్పోయారని విమర్శించారు. వైసీపీ పాలనలో ప్రజల ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు మర్చిపోయారని అన్నారు. బీసీ నాయకుడు అచ్చెన్నాయుడి పట్ల మానవత్వం లేకుండా ప్రవర్తించిన తీరుతో పోలీసుల వ్యవహారశైలి మనకు అర్థమవుతుందని చెప్పారు.
పలు అంశాల్లో కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా పోలీసుల తీరు మారడం లేదని, చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని గల్లా అన్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయేలోపలే... చట్ట విరుద్ధంగా విధులను నిర్వహిస్తున్న పోలీసు అధికారులపై కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.