కరోనా నివారణ, చికిత్సల కోసం ప్రతి జిల్లాకి రూ.కోటి చొప్పున కేటాయించిన ఏపీ సర్కారు

  • వివరించిన కొవిడ్-19 నియంత్రణ నోడల్ అధికారి కృష్ణ బాబు 
  • వైద్య పరికరాలు, సౌకర్యాలకు నిధుల వాడకం 
  • క్వారంటైన్‌ కేంద్రాల్లో పడకల సంఖ్య 5,000కు పెంపు
  • బాధితులకు ఆహారం కోసం ఒక్కొక్కరికి రోజుకు రూ.500 
కరోనా నివారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వాటి నిర్వాహణ కోసం ప్రతి జిల్లాకి కోటి రూపాయల చొప్పున కేటాయించిందని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మొత్తాన్ని వైద్య పరికరాలు, సౌకర్యాలకు వాడతారని వివరించింది. వాటి కేంద్రాలను జేసీలు పర్యవేక్షిస్తారని కొవిడ్-19 నియంత్రణ నోడల్ అధికారి కృష్ణ బాబు తెలిపారు.
 
క్వారంటైన్‌ కేంద్రాల్లో పడకల సంఖ్య 5,000కు పెంచాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. కరోనా బాధితులకు ఆహారం కోసం ఒక్కొక్కరికి రోజుకు రూ.500 చొప్పున కేటాయిస్తున్నట్లు తెలిపారు. అలాగే పనితీరు సరిగాలేని కేంద్రాల బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 


More Telugu News